కవిత ఎపిసోడ్ తో బిఆర్ఎస్ కు భారీ నష్టం..
Telangana Politics 2025 : రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. కేసీఆర్(KCR).. తనదైన వ్యూహాలు, రాజకీయ చతురతతో మహామహులకు ముచ్చెమటలు పట్టించిన రాజకీయ ఉద్ధండుడైన ఆయన పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఏకఛత్రాధిపత్యంతో పాలన కొనసాగిస్తూనే రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే ఇప్పుడు సొంత కూతురు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ (Kavitha Controversy) కారణంగా కేసీఆర్ గట్టి దెబ్బ తిన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ఇది ఊహించని షాక్ గా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికీ కోలుకోలేక, పార్టీని మళ్లీ అధికారంలోకి ఎలా తీసుకురావాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటు అధికార కాంగ్రెస్, మరో ప్రధాన పార్టీ బిజెపీలతో సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిక లోనువుతున్న తరుణంలోనే బిఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు కవిత వ్యవహారం మరింత ఇబ్బందిగా మారిందని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా ఎదుర్కొన్న కేసీఆర్‌కు తన సొంత ఇంటిలోనే బిడ్డ (K.Kavitha) రూపంలో ఎదురైన అంతర్యుద్దానికి ఎలా చెక్ పెట్టాలో తెలియక సతమతమవుతున్నట్లు సొంతపార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
Kavitha controversy : గులాబీ పార్టీలో గుబులు..
ఎన్నో ఆటుపోట్లు నిర్బంధాలను ఎదుర్కొని దశాబ్దాల కల అయిన తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా ప్రజల్లో ఎన్నటికీ చెరగని ముద్ర వేసుకుంది. బిఆర్ఎస్ (TRS) పార్టీ. ప్రజల్లో నాటుపోయిన గులాబీ పార్టీని బలహీన పరిచేందుకు అధికార పక్షమైన కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ తమ వ్యూహాలతో కేసీఆర్ ను అటు బిఆర్ఎస్ పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రెండు జాతీయ పార్టీల నుంచి సొంత పార్టీని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ కు సొంత కూతురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kalvakuntla Kavitha) వ్యవహారం ఇప్పుడు మింగుడు పడకుండా చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడం కేసీఆర్ కు సులభమే.. కానీ కూతురు రూపంలో ఎదురైన ఈ ఊహించని విపత్తును పూడ్చడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బిఆర్ఎస్ నేతలు.. క్షేత్రస్థాయి కార్యకర్తల ఆశలపై కవిత వ్యవహారం నీళ్లు చల్లినట్లయిందని ప్రజలు మాట్లాడుకోవడం గమనార్హం. ఇన్నాళ్లు కవితను పార్టీలో ” డాటర్ ఆఫ్ ఫైటర్ “గా చెప్పుకున్న కార్యకర్తలు అదే కూతురి వల్ల తమ అధినేత కు” డాటర్ స్ట్రోక్ (Daughter Stroke )” గట్టిగానే తగిలిందని చెప్పుకుంటున్నారు
అక్కడ షర్మిల.. ఇక్కడ కవిత
ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్.. వైఎస్ షర్మిల (YS Sharmila) ను తలపించేలా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కుటుంబంలో విభేదాలు: వై.ఎస్. షర్మిల తన సోదరుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించి, కొత్త పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇది వైఎస్ జగన్ పార్టీకి కొంత నష్టం కలిగించిందని, ఆయన ఓటమికి కూడా ఒక కారణమైందని వైసీపీ వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగింది. అదే తరహాలో కెసిఆర్. కుమార్తె కె. కవిత వ్యవహారం బిఆర్ఎస్. పార్టీకి, కెసిఆర్‌కు ఇబ్బందికరం ( BRS Political Crisis)గా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. కవితపై ఉన్న ఆరోపణలు, ఆమె దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు భావిస్తున్నారు.
పార్టీ ప్రతిష్టపై ప్రభావం: వై.ఎస్. షర్మిల వేరుకుంపటి వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి ఒక ఆయుధంగా మారింది. “సొంత చెల్లినే చూసుకోలేనోడు రాష్ట్రాన్ని ఏంపాలిస్తాడే విమర్శలు వచ్చాయి. ఇక కవిత ఎపిసోడ్ లోనూ బిఆర్ఎస్. పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయేలా చేసిందని, ఇది ప్రతిపక్షాలకు విమర్శలు చేయడానికి కలిసి వచ్చే అంశంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కె. కవిత ఎపిసోడ్ (ఢిల్లీ లిక్కర్ స్కామ్, అరెస్టు, జైలు జీవితం ) బిఆర్ఎస్. పార్టీని, కెసిఆర్‌ను విమర్శించడానికి బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు మంచి అవకాశం కల్పించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్, వంటి అంశాలపై బిఆర్ఎస్.పై విమర్శలు వస్తున్న తరుణంలో, కవిత ఎపిసోడ్ వాటికి తోడై మరింతగా ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశంగా మారింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.