- కాంగ్రెస్ రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చింది:
- మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్‌గా పేరుగాంచిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞత, తెలివితేటలకు ఈ ఎన్నిక కఠిన పరీక్షగా నిలుస్తుందని అన్నారు. విజ్ఞులైన ఓటర్లు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని అన్నారు. “కాంగ్రెస్ దుష్టపాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది,” అని కేసీఆర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని కేసీఆర్ అన్నారు. “జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగుతుంది,” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    