ప్రకటించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చాలా రోజుల తర్వాత మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Ex CM KCR )రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 12 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక ప్రకటన చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని ప్రకటించారు. గవర్నర్ అడ్రెస్ కార్యక్రమంలో కూడా ఆయన అటెండ్ అవుతారని తెలిపారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ (Dasuju Sravan) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే రేవంత్ (CM Revanth Reddy) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దాసోజు శ్రవణ్‌ను గతంలోనే టీఆర్‌ఎస్ ప్రతిపాదించిందని.. 2023లో బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. ఆయన గతంలో బిఆర్‌ఎస్‌ను వీడకపోతే ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేవారని పేర్కొన్నారు. పట్టుబట్టి బీజేపీనే ఆపిందని… ఇప్పుడు వారు ఆపినప్పటికీ దాసోజు శ్రవణ్ కు బీఆర్‌ఎస్ మళ్లీ చాన్స్ ఇచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్ పై నిప్పులు
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిది ఏం నడుస్తలేదని హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుజరాత్‌లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తమ పార్టీలో బీజేపీకి కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని.. ఆయన స్థానంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఉంటుందని అన్నారు. స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని, ఇప్పటికీ కూడా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేయడంలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అంత సత్తా ఉండి ఉంటే ముందే కేబినెట్ విస్తరణ చేసేవారన్నారు. 39 సార్లు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడం దిగడం తప్ప చేసింది ఆయన ఏం లేదని సెటైర్లు వేశారు.
ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి దివాళాకోరు తనం బయటపెట్టుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హాజరవుతారని ఈసందర్భంగా ప్రకటించారు. గవర్నర్ అడ్రెస్ కార్యక్రమానికి కూడా ఆయన వస్తారని తెలిపారు. తెలంగాణాలో ఆర్‌ఆర్‌టాక్స్ నడుస్తోందన్న మోదీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిమీద మోదీకి ఎందుకు అంత ప్రేమ అని నిలదీశారు. కిషన్ రెడ్డి నిస్సహాయుడని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..