Rooster Viral News | సమాజంలో ఒక్కోసారి చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. చాలా తేలికైన విషయంగా భావించేవి కొన్ని పోలీసు కేసుల వరకు వెళ్తాయి. తరచుగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలపై ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఇలాంటివేవీ కాకుండా ఓ వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే కోడి కూస్తూ తనకు నిద్ర పట్టకుండా చేస్తోందని కోడి యజమానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ ఆసక్తికరమైన ఘటన కేరళ (Kerala Viral News )లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు పక్కింటి కోడి కూస్తోందని (Rooster crowing) అధికారులకు ఫిర్యాదు చేశాడు. ‘తన ప్రశాంతమైన జీవితాన్ని భంగపరుస్తోందని ‘ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేరళలోని పతనంతిట్ట (Pathanamthitta) ప్రాంతంలోని పల్లికల్ (Pallikal) గ్రామంలో డబ్బుల విషయం లేదా భూ పంచాయితీ కాదు… ఉదయాన్నే కోడి చేసే పని ఉంటుంది కదా అదే పనిగా కూస్తోందని గొడవ మొదలైంది. రాధాకృష్ణ కురుప్ అనే వృద్ధుడు (Radhakrishna Kurup) రాత్రిపూట హాయిగా నిద్రపోలేకపోయాడు. అందువల్ల, తెల్లవారుజామున కూస్తూ తన ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగించే కోడి గురించి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Chicken Viral News కారణం ఏమిటి?
ప్రతిరోజు ఉదయం 3 గంటలకు, రాధాకృష్ణ కురుప్ పక్కింటి వారి కోడి ఎడతెగకుండా కూయడం ప్రారంభించేది, దాని వలన అతనికి నిద్ర పట్టడం కష్టమై, అతని ప్రశాంతమైన జీవితానికి అంతరాయం కలిగింది. కురుప్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన పొరుగున ఉన్న అనిల్ కుమార్ కోడి తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ అతను అడూర్ (Adoor RDO) రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO)లో ఫిర్యాదు చేశాడు.
అధికారులు ఫిర్యాదును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ సమస్యకు కోడి కారణమని భావించి RDO దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమస్య గురించి చర్చించడానికి కురుప్, అనిల్ కుమార్ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. పొరుగువారు తన ఇంటిపై అంతస్తులో తన కోళ్లను ఉంచినట్లు కనుగొన్నారు.
అంతా పరిశీలించగాక కురూప్ నిజంగానే ఆ కోడి కూతలతో కలవరపడ్డాడు. వివాదాన్ని పరిష్కరించడానికి కోళ్ల షెడ్‌ను పై అంతస్తు నుంచి తొలగించి ఇంటికి గదక్షిణం వైపుకు మార్చమని RDO ఆదేశించారు. ఆ తరలింపునకు 14 రోజుల గడువు ఇచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..