Khammam News | ఖమ్మం జిల్లాలో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి (ACB raid) చిక్కారు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ తల్లడ( Tallada) మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ తహసీల్ కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం తల్లడ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన బాధితుడిని అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం తహసీల్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేషర్ శివాజీ రాథోడ్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న తహసీల్దార్ వంకాయల సురేష్‌కుమార్ (Tahasildar) , రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మాలోత్ భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరిని వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశప్టెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    