One wedding, two brides : తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad district)లో చోటుచేసుకున్న ఓ పెళ్లి వేడుక ఆసక్తికరంగా మారింది. సాధారణ వివాహ వేడుకల కంటే భిన్నంగా వినూత్నంగా ఇది జరిగింది. గుమ్నూర్ ( Gumnoor village) గ్రామానికి చెందిన సూర్యదేవ్ (Suryadev) అనే రైతు ఒకే వేడుకలో తన ఇద్దరు లవర్స్‌ను పెళ్లి (marries both women) చేసుకున్నాడు. ఇది ఆ గ్రామంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇద్దరినీ విడిచిపెట్టలేక..
సూర్యదేవ్ మూడేళ్లుగా లాల్ దేవి, ఝల్కరి దేవిని (love with both) ప్రేమిస్తున్నాడు. ఇద్దరి ప్రేమలోపడ్డ సూర్యదేవ్ ఎవరినీ వదిలిపెట్టలేనని నిర్ణయించుకున్నాడు. ఇద్దరికీ సమానంగా ప్రేమను పంచుతానని, ఎవరినీ నొప్పించకూడదని భావించాడు. అందుకే ఇద్దరినీ ఒకే వివాహ వేడుక (single ceremony)లో పెళ్లి చేసుకోవాలని (decided to marry) నిర్ణయించుకున్నాడు. ఇది తెలియగానే గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ముగ్గురి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. సూర్యదేవ్ వారిని చివరికి ప్రసన్నం చేసుకున్నాడు. ఇద్దరి పట్ల తననుకున్న ప్రేమలో ఎలాంటి తారతమ్యాలు లేవని చెప్పాడు. తాను నిజాయితీగా ఇద్దరిని ప్రేమిస్తున్నానని, ఇద్దరినీ బాగా చూసుకుంటానని ఒప్పించాడు. దీంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు.
ఇద్దరు వధువుల పేర్లతో ఆహ్వాన పత్రిక
ఈ పెళ్లి అత్యంత వైభవంగా సంప్రదాయ రీతిలో జరిగింది. సుమారు వెయ్యి మంది అతిథులు హాజరయ్యారు. మంగళ వాద్యాలు, డోలు, సంగీతంతో వివాహ వేడుక చక్కగా సాగింది. పెళ్లి ఆహ్వాన పత్రిక (wedding invitation card)లో ఇద్దరు వధువుల పేర్లు కూడా ముద్రించారు. పెళ్లి అయ్యాక సూర్యదేవ్ తన భార్యలిద్దరితో సమానంగా జీవించేందుకు ప్రమాణం చేశాడు. ఇద్దరి మధ్య సమానమైన గౌరవం, ప్రేమ ఉండేలా చూసుకుంటానని అందరి సమక్షంలో మాటిచ్చాడు.
One wedding, two brides : సంప్రదాయానికి విరుద్ధమా?
ఇలాంటి పెళ్లి ఏనాడూ చూడలేదని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కొందరు ఇది ప్రేమకు మించిన ఉదాహరణగా పేర్కొంటున్నారు. మరికొందరు ఇది భారతీయ సంప్రదాయాలకు విరుద్ధమని (illegal for Hindus to practice polygamy in India) విమర్శిస్తున్నారు. గ్రామ పెద్దలు మాత్రం ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అని, అందుకే దీనిని అంగీకరించామని చెబుతున్నారు.
చట్టపరంగా ఇది సరైనదేనా?
భారతదేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి. బహువివాహం నేరంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని ఆదివాసీ తెగలలో ఇద్దరు భార్యలు కలిగి ఉండటం ఇంకా కొనసాగుతోంది. ఈ వివాహం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కొందరు సూర్యదేవ్ నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసించారు. మరికొందరు ఇది చట్టానికి వ్యతిరేకమని విమర్శించారు. కొంతమంది వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయంతో ఈ పెళ్లిని సమర్థిస్తున్నారు. మరికొందరు ఇలాంటి వివాహాల వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..