- వివాదాల నడుమ కీలక పరిణామం
- 16 పేజీల నివేదికతో మీనాక్షి నటరాజన్‌ను కలుసిన సురేఖ
Warangal News | కొండా మురళి.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ గా చేసిన విమర్శలు కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ఆయన విమర్శించారు. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం తన సతీమణి, మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తో కలిసి కొండా మురళి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తో భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అలాగే మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ అందజేశారు.
Konda Murali : ఎన్నో కేసులకు భయపడింది లేదు..
కాగా లేఖలో కొండా మురళి (Konda Murali ) తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని, పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై ఆమెకు నివేదిక ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. ఎన్నో కేసులకు నేను భయపడలేదు.. భయం లేదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నా. అని పేర్కొన్నారు.
44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.. నాకు ప్రజాబలం ఉంది.. నాకు భయపడకపోతే నాపై 23 కేసులు పెట్టకపోయేవారు. పోటా, టడా కేసులకే నేను ఏ మాత్రం భయపడలేదు.. ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది.. అయినా కూడా కొందరు నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. కాగా నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం కొండా దంపతులు ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లారు.
స్థానిక ఎన్నికపై..
కొండా మురళీ మాట్లాడుతూ.. రేపు జరగబోయే సమావేశంపై చర్చించాం.. రేపు వరంగల్ నుంచి ఎంత మంది వొస్తారు అనేది చర్చించామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ (Congress Party) ని బతికించడం నా ఉద్దేశం.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని ప్రధాని చేయడం నా లక్ష్యం. పని చేసే వాళ్లపైనే రాళ్లు విసురుతారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలిచేలా.. ఎమ్మెల్యేలను మళ్లీ వరంగల్ లో గెలిపించడం నా బాధ్యత.. నేను ఎవ్వడికి భయపడేది లేదు.. నేను బీసీ కార్డు పైనే బతుకుతున్నాను.. రోజు 500 మంది ప్రజలకు భోజనం పెడతాను.. ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందు ఉంటాను కాబట్టి ప్రజలు వస్తున్నారు.. ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. నా కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు.. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది.. . మా కూతురు తొందర పడి అన్నదో.. లేదా ఆలోచించి అనిందో నాకు తెలియదని కొండా మురళి వెల్లడించారు.
కొండా సురేఖ మాట్లాడుతూ.. నా కూతురు పరకాల (Parakala) నుంచి పోటీ చేస్తానని చెప్పడంలో తప్పు లేదు.. ఆమె టికెట్ ఆశిస్తోంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం.. కొండా మురళీ సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు.. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకు ఉందని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    