Kota Srinivasa Rao | టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా తన ప్రతిభను
చాటారు.
నాలుగు దశాబ్దాల ప్రయాణం..
కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao ) 1942 జులై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లా కంకిపాడులో జన్మించారు. కోట తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట శ్రీనివాసరావు కూడా తండ్రి మాదిరిగా డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే, నటనపై ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా ‘సువర్ణ సుందరి’ అనే సినిమాలో నటించారు.
ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా చిత్రాలలో కోట నటించారు. క్రూరమైన విలన్ పాత్ర పోషించినా, హాస్యనటుడిగా నటించినా, లేదా సహాయక పాత్ర పోషించినా, కోట ప్రతి పాత్రకు జీవం పోశారు.
ఆయన శివ, గాయం, మనీ, శత్రువు, అహ నా పెళ్లంట, బొమ్మరిల్లు, ఆటాడు, మల్లీశ్వరి, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే.. రక్త చరిత్ర, లీడర్, S/O సత్యమూర్తి, అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో విలక్షణమైన నటన ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.2003లో, అతను సామితో తమిళ చిత్రసీమలో చిరస్మరణీయమైన అరంగేట్రం చేసారు,
విలన్, సహాయ, క్యారెక్టర్ పాత్రల్లో తన ప్రతిభకు కోటాను తొమ్మిది నంది అవార్డులతో సత్కరించారు. 2015లో, భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన కృషికి గాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని ఆయన అందుకున్నారు.ఇక కోట శ్రీనివాస్ రావుకు భార్య రుక్మిణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమారుడు కోట ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
దశాబ్దాల సినీ ప్రయాణంలో కోట అనేక విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన(1985), గాయం (1993), తీర్పు (1994), లిటిల్ సోల్జర్స్ (1996), గణేష్ (1998), చిన్న (2000), పెళ్లైన కొత్తలో (2006), పృథ్వీ నారాయణ(2002), ఆ నలుగురు (2004) చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 2012లో చిత్రం వందే జగద్గురుమ్ సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ బిజెపి ఎమ్మెల్యేగా పనిచేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.