Sarkar Live

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌

Hyderabad : త్వ‌ర‌లో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) ఉంటుందని, ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి మ‌ళ్లీ మ‌న జైత్ర‌యాత్ర కొన‌సాగిద్దామ‌ని భారత రాష్ట్ర సమితి (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌

KTR

Hyderabad : త్వ‌ర‌లో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) ఉంటుందని, ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి మ‌ళ్లీ మ‌న జైత్ర‌యాత్ర కొన‌సాగిద్దామ‌ని భారత రాష్ట్ర సమితి (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశం బుధ‌వారం జ‌రిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మాగంటి సునీత (Maganti Sunitha)కు అందరి ఆశీస్సులు, అండ‌దండ‌లు ఉంటాయని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని తెలిపారు. ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువులో ఇండ్లు కట్టినా హైడ్రా అక్క‌డికి వెళ్లదని.. కానీ పేదలు ఉండే ప్రాంతాల‌కు వెళ్లి ఇండ్లు కూలగొడుతుంద‌ని కేటీఆర్‌ విమర్శించారు.

”ఉపఎన్నిక (Jubilee Hills Byelection) కోసం సర్వేలు చేయిస్తున్నాం.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుంది. కొన్ని బస్తీల్లో వెనకంజలో ఉన్నాం. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి.. లేనివారివి చేర్చాలి. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు బంద్‌ చేస్తామని.. ఇళ్లు కూలుస్తామని అంటారు. పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఉన్నాయట. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో సత్తా చూపాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. జూబ్లీహిల్స్‌ నుంచి భారత రాష్ట్ర సమితి జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలి” అని కేటీఆర్‌ అన్నారు.

కాగా మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి సునీత మాట్లాడుతూ.. గోపీనాథ్‌లాగే తనకూ అండగా నిలవాలని కార్యకర్తలను కోరారు. గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితిలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?