Hyderabad | పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే వారి పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ (BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎన్నికలు వస్తే ఓటమి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. శేరిలింగంపల్లి (sharlingampalli) నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఓటువేసిన ప్రజలను నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల దందాల కోసమే హైడ్రా పనిచేస్తోందని ఆరోపించారు. హైడ్రా (Hydraa) కారణంగానే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని కేటీఆర్ విమర్శించారు.
BRS Party : హైదరాబాద్ ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం..
2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కరించి, ఇళ్లలో, షాపుల్లో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి అన్ని పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ తీర్చదిద్దారని అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.