KTR ED Case | బీఆర్ఎస్ కార్యకలాపాల అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (K.T. Rama Rao)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ సమన్లు పంపింది. వీరిద్దరినీ వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో జరిగిన అవకతవకల కేసుకు సంబంధించి ఈడీ ఈ సమన్లు జారీ చేసింది.
KTR ED Case : ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో జరిగిన అనియమితాలపై అవినీతి నిరోధక బ్యూరో (ACB) నమోదు చేసిన FIR ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. అదనంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో విదేశీ మారక నిధుల నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది.
డిసెంబరు 29న ఏసీబీ కేసు నమోదు
డిసెంబరు 29న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దాన కిషోర్ ఫిర్యాదు మేరకు కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలపై ACB కేసు నమోదు చేసింది. ఇది గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి తర్వాత FIR అయ్యింది.
ఈడీ దర్యాప్తు.. ECIR నమోదు
సెక్షన్ 13(1)(A), 13(2) (అవినీతి నిరోధక చట్టం కింద), IPC సెక్షన్ 409, 120(B) కింద ఏబీసీ FIR నమోదు చేసింది. ఫార్ములా ఈ -ఆపరేషన్స్ లిమిటెడ్ (FEO) సంస్థకు, ఇతరులకు నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరుసటి రోజే ఈడీ తన దర్యాప్తును ప్రారంభిస్తూ ECIR (Enforcement Case Information Report) నమోదు చేసింది.
HMDA పాత్రపై ఆరోపణలు
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ సమయంలో HMDA ప్రత్యక్ష భాగస్వామి కాకపోయినా ఆ సంస్థ నుంచి నిధులు బదిలీ చేయడంపై ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్లు చేసుకుని భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. రాబోయే ఫార్ములా ఈ-రేస్ సీజన్ల కోసం రూ.600 కోట్లకు పైగా ఆర్థిక హామీలను ఇచ్చి, చట్టబద్ధ ప్రక్రియలకు విరుద్ధంగా నడిచారనే అంశంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “KTR | కేటీఆర్‌కు ఈడీ సమన్లు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం”