తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working president KT Rama Rao) నిప్పులు చెరిగారు. రైతుల పంట రుణమాఫీ (Rythu Runa Mafi) ని పూర్తిగా అమలు చేశామని చెబుతూ సీఎం చేసిన ప్రకటనలు పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. దీనికి సీఎం (Chief Minister A Revanth Reddy) రైతులపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మీ అబద్ధాలను మీ మంత్రే బయట పెట్టారు
రేవంత్‌రెడ్డి అబద్ధాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Health Minister Damodara Raja Narasimha) బహిర్గతం చేశారని కేటీఆర్ అన్నారు. పంట రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని తన నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరిగిన సమావేశంలో దామోదర స్వయంగా అంగీకరించారని తెలిపారు. పంట రుణమాఫీ పూర్తిగా అమలు (implementing complete crop loan waiver in Telangana) చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతుండగా మంత్రి దామోదర అసలు వాస్తవాలను బయట పెట్టారని అన్నారు.
Rythu Runa Mafi అమలుపై ఎవరు సిగ్గు పడాలి?
ఎవరు సిగ్గు పడాలో, ఎవరు రాజీనామా చేయాలో మీ క్యాబినెట్ సహచరుడి చెప్పిన వాస్తవాలే నిర్ధారిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల పంట రుణాల మాఫీ అనేది దొంగ హామీగా మిగిలిపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి తక్షణమే కొండరెడ్డిపల్లి లేదా కొడంగల్ గ్రామాలకు వెళ్లి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులకు శాపంగా కాంగ్రెస్ పాలన
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలన రైతులకు శాపంగా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ హామీలను నిలబెట్టుకోలేని ఆ పార్టీ నేతలు పంట రుణమాఫీ అంశంలో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల రుణమాఫీ (Rythu Runa Mafi) ముసుగులో వాస్తవాలను దాచిపెట్టి, దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టడమే వారి విధానమని ఆరోపించారు.
రైతులకు అండగా ఉంటాం
తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లను బహిర్గతం చేయడం ద్వారా రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే బదులు, వారిని మోసం చేస్తూ వారి నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేస్తోందన్నారు. దీనిపై బీఆర్ఎస్ పోరాటాలు ఉధృతం చేస్తుందని తెలిపారు. రైతుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావడం తమ బాధ్యత అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








