kubhera movie review
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందాన మెయిన్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన మూవీ కుబేర. శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ బిగ్ స్టార్స్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తీసిన మూవీ ఈ రోజు రిలీజ్ అయింది.భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….
స్టోరీ…
బాగా డబ్బున్న వ్యక్తికి, ఏమీ లేని ఒక వ్యక్తికి మధ్య జరిగే స్టోరీ. ఒక మాజీ సీబీఐ ఆఫీసర్ దీపక్ కు(నాగార్జున) ఒక మిషన్ లో భాగంగా బిచ్చగాడు అయిన దేవా(ధనుష్)ను అప్పగిస్తారు. దీపక్ దేవాతో కలిసి చేయావలసిన ఆ ఆపరేషన్ ఏంటీ..?, దాని వల్ల దేవా పడిన ఇబ్బందులేంటి..దేవాను దీపక్ కి అప్పగించింది ఎవరు అనేది స్టోరీ…
మూవీ ఎలా ఉంది…
శేఖర్ కమ్ముల మూవీ అంటేనే ఆడియన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయని విధంగా మూవీ ఉందని చెప్పొచ్చు. ట్రూలీ సూపర్ గుడ్ ఫిల్మ్. ఇలాంటి ఒక కథని తెరపైకి తీసుకొచ్చి ఆడియన్స్ ను మెప్పించేలా తీయడంలో శేఖర్ కమ్ముల ఎక్కడ కూడా తడబడలేదు. మూవీ మొదలైన కొద్దిసేపటికే అసలు స్టోరీ ఏంటో ఆడియన్స్ కి అర్థమవుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు సాగదీతగా అనిపించినా ఆడియన్స్ కథలో ఇన్వాల్వ్ అవుతారు. కథనంలో ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్తాడు. ఇక సెకండాఫ్ లో మాత్రం స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.రియల్ గా జరుగుతున్నట్టు ఆడియన్స్ ఫీల్ అయ్యేలా సీన్స్ అద్భుతంగా తీశారు. కొన్ని సీన్స్ లో ఆడియన్స్ ఎమోషన ల్ అవ్వడం ఖాయం. చాలా లెంగ్త్ ఉన్న ఈ మూవీని డైరెక్టర్ తను అనుకున్నది అనుకున్నట్టుగా తీశాడు. ఆడియన్స్ కి మాత్రం మూవీ మొదలైన కొద్దిసేపటికి సుత్తి అనిపించిన ఆఖరికి సూటిగా చెప్పేశాడనే ఫీలింగ్ ఉంటుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
ముందుగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డిఫరెంట్ గా ఈ మూవీని తెరకెక్కించాడు. పాన్ ఇండియన్ మూవీని ఫస్ట్ టైమ్ తీసి తన కెరియర్ లో మరో భారీ హిట్టు అందుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల మూవీ అంటే కచ్చితంగా ఏదో విషయం ఉంటుందనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చాడు. యాక్టర్స్ అందరి నుండి తనకేం కావాలో అది రాబట్టుకున్నాడు. ఈ మూవీతో ధనుష్ కి ఇంకో నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అని
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ గురించి శేఖర్ కమ్ముల చెప్పిన మాటల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదనిపించింది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.కచ్చితంగా మరో నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అనేలా తన యాక్టింగ్ ఉంది. చాలా నాచురల్ గా చేశాడు.తన మూవీల్లో ఈ మూవీ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఆ రోల్ లో మరో యాక్టర్ ని ఊహించుకోవడం కష్టం. తను మాత్రమే చెయ్యగలడు అనేంతగా మెప్పించాడు. తన యాక్టింగ్ తో ఆడియన్స్ తో కంట తడిని పెట్టించాడు.కింగ్ నాగార్జునకు ఈ మధ్య సరైన హిట్టు లేదు. ఈ మూవీ లో మంచి క్యారెక్టర్ పడింది. ఎమోషనల్ సీన్స్ లో నాగ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో తను ఏంటో నిరూపించుకున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందాన యాక్టింగ్ కూడా సూపర్ అనిపించింది. విలన్ రోల్ లో జిమ్ సర్బ్ ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు. ఇక ఇందులో మరో హీరో ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పొచ్చు. తనిచ్చిన సాంగ్స్ తో మూవీ రిలీజ్ ముందే ఆకట్టుకోగా బిజీఎం తో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో వింటేజ్ డీఎస్పీ ని గుర్తుచేశారు. తన మ్యూజిక్ తో సీన్స్ మరింత ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్…
- ధనుష్ నటన
- శేఖర్ కమ్ముల డైరెక్షన్
- డీఎస్పీ మ్యూజిక్
- ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్…
- సాగదీత సీన్లు
- ఫస్ట్ హాఫ్
రేటింగ్..
4.5/5