KVS Admissions 2025 : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమవుతున్నాయి. ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్ నోటిఫికేషన్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (Kendriya Vidyalaya Sangathan (KVS) విడుదల చేసింది. ఈ ప్రవేశాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రవేశాల (Admissions)కు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
KVS Admissions 2025 : సీట్ల రిజర్వేషన్ వివరాలు
కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్ పొందేందుకు కొన్ని రిజర్వేషన్ నిబంధనలు ఉన్నాయి.
- ఎస్సీ విద్యార్థులకు 15%
- ఎస్టీ విద్యార్థులకు 7.5%
- ఓబీసీ విద్యార్థులకు 27%
- దివ్యాంగ విద్యార్థులకు 3% రిజర్వేషన్ ఉంటుంది.
విద్యార్థుల వయో పరిమితి
ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు మార్చి 31 నాటికి వయస్సు 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతా తరగతుల వయో పరిమితి వివరాలు:
- రెండో తరగతి: 7-9 ఏళ్లు
- మూడు, నాలుగో తరగతి: 8-10 ఏళ్లు
- ఐదో తరగతి: 9-11 ఏళ్లు
- ఆరో తరగతి: 10-12 ఏళ్లు
- ఏడో తరగతి: 11-13 ఏళ్లు
- ఎనిమిదో తరగతి: 12-14 ఏళ్లు
- తొమ్మిదో తరగతి: 13-15 ఏళ్లు
- పదో తరగతి: 14-16 ఏళ్లు
రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
తరగతులు, సీట్ల వివరాలు
ప్రతి కేంద్రీయ విద్యాలయంలో ఒక్కో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. రెండు సెక్షన్లు కలిపితే ఒక్కో తరగతికి 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
ఎంపిక ప్రక్రియ
- ఒకటో తరగతి ప్రవేశాలు: ఆన్‌లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు.
- రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు : ప్రవేశ పరీక్ష ఉండదు. ప్రయారిటీ కేటగిరీ ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.
- తొమ్మిదో తరగతి : ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- 11వ తరగతి: పదో తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇవ్వనున్నారు. పదో తరగతిలో మిగిలిన సీట్లు ఉంటేనే కొత్త విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం
- ఒకటో తరగతి: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- రెండో తరగతి నుంచి ఆపై తరగతులు: ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే.. ఆయా కేంద్రీయ విద్యాలయాలను ప్రత్యక్షంగా సంప్రదించి దరఖాస్తు సమర్పించాలి.
- 11వ తరగతి రిజిస్ట్రేషన్: పదో తరగతి ఫలితాలు వెలువడిన 10 రోజుల్లోపు పూర్తిచేయాలి. ఎంపికైన విద్యార్థుల జాబితాను 20 రోజుల్లోపు ప్రకటిస్తారు.
KVS Admissions 2025 ఈ ప్రవేశ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందించే అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తమ అర్హతలను పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..