ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Uttar Pradesh’s Baghpat)లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం (Laddoo Mahotsav) సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 60 మందికి పైగా భక్తులు స్టేజ్ కింద పడిపోయారు.
ఆరుగురి మృతి, 50 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలోని ఆదినాథ్ ఆలయంలో ఈ రోజు జరిగిన లడ్డూ సమర్పణ మహోత్సవం (Laddoo Mahotsav)లో అపశ్రుతి చోటోచేసుకుంది. స్టేజ్ కుప్ప కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో సుమారు 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
Laddoo Mahotsav దుర్ఘటన ఎలా జరిగింది ?
జైనుల (Jain community) సంప్రదాయంలోని ఎంతో ముఖ్యమైన ఆదినాథుని లడ్డూ సమర్పణ కార్యక్రమంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఉత్సవానికి వందలాది భక్తులు హాజరయ్యారు. లడ్డూ సమర్పణ కోసం ప్రత్యేకంగా బాంబూ, చెక్కలతో తాత్కాలిక వేదికను ఏర్పాటు చేశారు. అయితే, ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో అనేకమంది భక్తులు నేరుగా కిందపడ్డారు, పలువురు గాయపడ్డారు. ఈ ఉత్సవం గత 30 ఏళ్లుగా జరుగుతోందని, ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని బాగ్‌పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తెలిపారు.
అధికారుల సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చాలా మందికి ప్రాథమిక చికిత్స అందించి, 20 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. బాధితులకు ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి సహాయం అందించాలన్నారు. అలాగే, పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
కంటతడి పెట్టిన జైన భక్తులు
ఈ సంఘటన జైన భక్తులకు తీవ్రంగా కలచివేసింది. భారీ సంఖ్యలో పాల్గొనే ఈ మహోత్సవంలో ఈసారి జరిగిన ప్రమాదం బాధాకరమని కంటతడి పెట్టారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] అపశ్రుతి (Maha Kumbh Stampede) చోటుచేసుకోవడంపై ప్రధాని […]