ఫార్మాసిటీపై ఆందోళన చేపట్టిన గిరిజన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి వారిని అవమానించేలా దారుణానికి పాల్పడ్డారు. అధికారులపై దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో లగచర్ల (Lagacharla) కు చెందిన రైతు హీర్యానాయక్‌తో పాటు మరికొందరు రైతులను అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే..
కాగా హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్య తలెత్తడంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లి 2డీ ఈకో టెస్ట్ చేయించారు. సంకెళ్లు వేసి తీసుకురావడం సరికాదని గతంలో న్యాయాస్థానాలు హెచ్చరించినా కూడా పోలీసులు పట్టించుకోకుండా హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. . కాగా ఆసుపత్రిలో హీర్యా నాయక్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు.
సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం
ఇదిలా ఉండగా లగచర్ల గిరిజన రైతులకు (Lagacharla farmer) సంకెళ్లు వేయడం పట్ల బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండె నొప్పి వచ్చిన రైతులకుసంకెళ్లు వేయడం దారుణమని, రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి ఇది నిదర్శనమని నిప్పులు చెరిగారు.
హీర్యా నాయక్ కి గుండెనొప్పి వస్తే చికిత్స అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టిందని సకాలంలో దవాఖానకు తరలించకుండా దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. గురువారం ఉదయం రెండోసారి మళ్లీ గుండెపోటు రావడంతో అతడిని సంగారెడ్డి హాస్పిటల్ కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా ఇబ్బందుల్లో ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
లగచర్లకు చెందిన రైతు హీర్యా నాయక్ ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఘటనకు సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం వొచ్చిందని అధికారులపై ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..