Sarkar Live

Tirumala | తిరుమలలో చిరుతల‌ కలకలం..

Leopard Sighting : తిరుమల (Tirumala)లో చిరుతలు సంచారం క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే భ‌క్తుల్లో భ‌యాందోళ‌న నెల‌కొన‌గా తాజాగా జూపార్క్ రోడ్డు ప్రాంతం నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా అటవీ ప్రాంతంలో ఓ చిరుత క‌నిపించింది (Leopard Sighting). దీంతో

Tirumala

Leopard Sighting : తిరుమల (Tirumala)లో చిరుతలు సంచారం క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే భ‌క్తుల్లో భ‌యాందోళ‌న నెల‌కొన‌గా తాజాగా జూపార్క్ రోడ్డు ప్రాంతం నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా అటవీ ప్రాంతంలో ఓ చిరుత క‌నిపించింది (Leopard Sighting). దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ (TTD Security) సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై ఫారెస్టు (Forest Department) అధికారులకు స‌మాచారమిచ్చారు.

ఊర‌ట క‌లిగిన వెంట‌నే మ‌ళ్లీ…

కొన్ని వారాలుగా తిరుమల (Tirumala Hills) పరిసర ప్రాంతాల్లో చిరుతల‌ (Leopards) కదలికలు తరచుగా నమోదవుతున్నాయి. సుమారు రెండు వారాల క్రితం కూడా ఒక చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు తీవ్రంగా భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) అధికారులు భ‌ద్ర‌త ప‌ర‌మైన అనేక చర్యలు చేప‌డుతున్నారు. చిరుతను పట్టుకోవడానికి తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ సమీపంలో ఒక ప్రత్యేకమైన బోనును ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ఒక చిరుత అందులో చిక్కడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో భక్తుల్లో మళ్లీ భయం మొదలైంది

Leopard Sighting in Tirumala : ప‌సిగ‌డుతున్న అధికారులు

చిరుతల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి అటవీ శాఖ (Andhra Pradesh Forest) అధికారులు ఒక ప్రత్యేక విభాగాన్ని (సెల్) ఏర్పాటు చేశారు. శాటిలైట్ ట్యాగింగ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ట్రాకింగ్, అత్యాధునిక నైట్ విజన్ కెమెరాల లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన బృందాలను కూడా రంగంలోకి దింపారు. ప్రస్తుతం తిరుమలలోని అటవీ మ్యూజియం ఉన్న భవనంలోనే ఈ ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సెల్ ద్వారా చిరుతల (Leopards) ప్రస్తుత స్థానం, వాటి కదలికల సరళి, అవి సంచరించే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. త‌ద్వారా భక్తులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవడం సులభమవుతుంది.

భ‌క్తుల‌కు సూచ‌న‌ల జారీ

అటవీ శాఖ (Forest Department) అధికారులు స్థానిక ప్రజలకు, భక్తులకు కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కాలినడకన వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని, తమ వెంట టార్చ్ లైట్లు లేదా ఇతర వెలుతురు సాధనాలను తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అటవీ ప్రాంతాల సమీపంలో ఒంటరిగా తిరగొద్దని కూడా హెచ్చరిక‌లు జారీ చేశారు. టీటీడీ (TTD) అధికారులు కూడా భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారు. తద్వారా ఎవరైనా చిరుతను చూసినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించొచ్చు.

శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి అటవీ శాఖ (Tirumala Forest Department) అధికారులు చిరుతలను పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరలించాల‌నుకుంటున్నారు. అయితే.. చిరుతలు చాలా తెలివైన జంతువులు కావడం వల్ల వాటిని పట్టుకోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?