Liquor Revenue | తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ విక్రయాల్లో ప్రభుత్వానికి ఎనిమిది నెలల్లోనే రూ.20,903.13 కోట్ల ఆదాయం వొచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ సవంత్సరం ఏప్రిల్ నెల నుంచి నవంబరు వరకు ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాలపై రెవెన్యూ రూపంలో రూ.10,285.58 కోట్లు, అలాగే పన్నుల రూపంలో రూ.10,607.55 కోట్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ శాసన సభలో వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిక్ష బిఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ సమాధానమిచ్చింది. రాష్ట్రంలో అక్రమ లిక్కర్ అమ్మకాలను నియంత్రిస్తున్నామని, ఎప్పటికప్పుడు అనధికారిక మద్యం విక్రయిస్తున్నవారిపై కేసులు పెడుతున్నామని చెప్పారు.
TG Liquor Cases : ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నాటికి అనధికారిక విక్రయాలపై 6,915 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.ఈ కేసుల్లో 6,728 మందిని అరెస్టు చేసి 74,425 లీటర్ల లిక్కర్, 353 వాహనాలను జప్తు చేసినట్లు వివరించారు. మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా 735 అవగాహన సదస్సులు నిర్వహించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.
అక్టోబర్ 16 నుంచి ఏపీలో ప్రైవేట్ లిక్కర్ షాపులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల బిజినెస్ జరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. 55 రోజుల వ్యవధిలో 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్ బాటిళ్లను విక్రయించామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








