‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో ఈ రోజు వాడీవేడీగా చర్చలు (Lok Sabha Debate) సాగాయి. విపక్ష నేతలు సంధించిన ప్రశ్నలకు ప్రధాని మోదీ బృందం దీటుగా సమాధానమిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సహా హోం మత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాల వాదనలను కొట్టిపారేశారు. పార్లమెంట్ వేదికగా కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమేయం లేదని మోదీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిందని తెలిపారు.’ దయచేసి దాడులు ఆపండి’ అని పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓను వేడుకోవడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామని సభకు మోదీ వివరించారు.
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని ప్రధాని ధైర్యంగా చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. మోదీకి దమ్ముంటే ట్రంప్ అబద్ధాలకోరు అని సభా వేదికగా చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత సవాల్‌ను స్వీకరించిన మోదీ తమకు యుద్ధం ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనకు మూడు నాలుగుసార్లు కాల్ చేసి.. పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని హెచ్చరించారని మోదీ అంగీకరించారు. కానీ, తాను మాత్రం మేము పాక్‌కు దీటుగా బదులిస్తామని ఆయనతో స్పష్టం చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
ఆపరేషన్ సింధూరం పట్ల గౌరవం, సైన్యం పట్ల గౌరవం ప్రశ్నలలో కూడా స్థిరంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు సూచించారు. భారతమాతపై దాడి జరిగితే, అప్పుడు తీవ్రమైన దాడి చేయాల్సి ఉంటుంది. శత్రువు ఎక్కడ ఉన్నా, మనం భారతదేశం కోసం జీవించాల్సి ఉంటుంది. లోక్‌సభలో మోదీ మాట్లాడుతూ, ‘ఒక కుటుంబం ఒత్తిడితో పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం మానేయాలని కోరారు. దేశ విజయం సాధించిన ఈ క్షణాన్ని కాంగ్రెస్ ఎగతాళి చేసే క్షణంగా మార్చకూడదు. కాంగ్రెస్ తన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.