Sarkar Live

Khaidi 2 | ఖైదీ 2 లో ఆమె హీరోయినా…అదిరిపోతుంది..

ఐదు సంవత్సరాల క్రితం లోకేష్ కనకరాజు (lokesh kanagaraj) డైరెక్షన్లో కార్తీ (Karthi) హీరోగా వచ్చిన ఖైదీ (Khaidi 2) మూవీ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. కార్తీ కెరీర్ లోనే చెప్పుకోదగ్గ సినిమాగా మిగిలిపోయిన ఈ మూవీ చూసిన

Khaidi 2

ఐదు సంవత్సరాల క్రితం లోకేష్ కనకరాజు (lokesh kanagaraj) డైరెక్షన్లో కార్తీ (Karthi) హీరోగా వచ్చిన ఖైదీ (Khaidi 2) మూవీ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. కార్తీ కెరీర్ లోనే చెప్పుకోదగ్గ సినిమాగా మిగిలిపోయిన ఈ మూవీ చూసిన వాళ్లందరూ దీనికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఈ మూవీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయేలా తెరకెక్కించారు. అంతలా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ను రాసుకొని తెర పైకి తీసుకొచ్చారు.

ఖైదీ మూవీతోనే లోకేష్ కనకరాజు అనే డైరెక్టర్ పేరు అందరికీ తెలిసింది. తను తర్వాత తీసిన సినిమాలు కూడా అంతే భారీ విజయాలను అందుకున్నాయి. విక్రమ్, లియో, మాస్టర్ లాంటి సినిమాలతో కోలీవుడ్లో లోకేష్ కనకరాజు పేరు మార్మోగిపోయింది. తన నుండి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఆ మూవీ అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూనే ఉంటారు.

ఒక సినిమాలోని క్యారెక్టర్ లను మరొక సినిమాలోకి తీసుకొచ్చి కథను నడిపించే విధానంతో హిట్టు కొట్టడం లోకేష్ కనకరాజుకే చెల్లింది. సినిమాలోని పాత్రలను ఇలా కూడా వాడుకోవచ్చా అని డైరెక్టర్లకు ఒక కొత్త దారిని చూపెట్టాడు. ప్రజెంట్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో (super star Rajnikanth) కూలీ అనే మూవీ తీస్తున్నాడు. ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటిలో ఒక సినిమాలో ఉన్న క్యారెక్టర్ లను మరొక సినిమాలో వాడుకుని ఆడియన్స్ ని మెప్పించాడు. లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ క్రియేషన్ అని ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేశాడు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ తో తీసే సినిమా మాత్రం ఆయన గత చిత్రాలకు ఏమాత్రం సంబంధం లేదని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కథ పూర్తిగా వేరని గత చిత్రాలతో ఏమాత్రం సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.

Khaidi 2 పై కీలక అప్ డేట్

ఈ మూవీ తర్వాత కార్తీ ఖైదీకి సీక్వెల్ ను తీసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వేసవిలో చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు ఇటీవలే కార్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మొదటి భాగం ఆధ్యాంతం ఆసక్తికరంగా ఉన్న ఈ మూవీ సెకండ్ పార్ట్ (Khaidi 2) మరింత థ్రిల్లింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కార్తీ కూడా ఒక సినిమా హిట్ అయితే దానికి కొనసాగింపుగా తీసే సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే మిత్రన్ డైరెక్షన్లో వచ్చిన కార్తీ సూపర్ హిట్ మూవీ సర్దార్ కి కొనసాగింపుగా సర్దార్-2ను తీస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ కూడా ప్రారంభించారు. ఈ మూవీని కంప్లీట్ చేసే లోపు లోకేష్ కూలి మూవీ రిలీజ్ అవుతుంది. తర్వాత ఖైదీ -2 పై ఫోకస్ చేస్తారు.కార్తీ గత చిత్రం సత్యం సుందరం తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీని 96 ఫేమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. కార్తీ ప్రజెంట్ సర్దార్ -2 లో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఖైదీలో హీరోయిన్ పాత్ర లేదు.హీరోకు ఒక పాప ఉంటుందని చూపెట్టారు..కానీ హీరో భార్యను మాత్రమే చూపెట్టలేదు. ఖైదీ-2 లో కథ వీరి మధ్య ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హీరో బ్యాగ్రౌండ్ ఏంటి..అంతకు ముందు ఏం చేసేవాడు.. తన భార్య ఏమైంది.. పాప ఎందుకు అనాధాశ్రమంలో పెరిగింది.. డ్రగ్స్ మాఫీయాకు, హీరోకు ఏం సంబంధం అనే విషయాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు కోలీవుడ్ చర్చ మొత్తం Khaidi 2 లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే దానిపై నడుస్తుంది. మలయాళ భామ రజిష విజయన్ ని (Rajisha vijayan) హీరోయిన్ గా ఈ మూవీకి ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సినీ వర్గాల టాక్. అనురాగ కరిక్కిన్ వెళ్ళమ్ తో వెండి తెరకు పరిచయమై కర్ణన్, జై భీమ్, సర్ధార్ మూవీలతో ఆకట్టుకుంది. ఆల్రెడీ కార్తీ తో సర్దార్ మూవీ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఖైదీ -2 లో నటిస్తుందని ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!