kollywood News | కోలీవుడ్ హీరో విశాల్ (Hero Vishal ) నటించిన మద గజ రాజా (Madha Gaja Raja) సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ 12 ఏళ్ల క్రితమే పూర్తయినా కొన్ని కారణాలవల్ల అప్పుడు విడుదలకు నోచుకోలేదు. రిలీజ్ అయిన నాటి నుండి ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తమిళంలో దాదాపు 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా కొన్ని రోజుల్లో 100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం తీసిన మూవీ ఇప్పుడు విడుదలై 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అనేది మామూలు విషయం కాదు.
ఈ మూవీ ఇచ్చిన స్ఫూర్తితో చిత్రీకరణ పూర్తయి మరుగున పడి ఉన్న మరిన్ని మూవీస్ కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ కోవలోకే ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధ్రువ నక్షత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలిపారు.
Hero Vishal Next Movie : హీరో విషాల్ తర్వాత మూవీ..
ఈ వేసవికి కచ్చితంగా ఈ మూవీని విడుదల చేస్తామన్నారు. విశాల్ నటించిన మదగజ రాజా మూవీనే తనకు స్ఫూర్తినిచ్చింది అన్నారు. ఈ మూవీ విషయానికొస్తే మొదట ఈ స్టోరీని స్టార్ హీరో సూర్యకి వినిపించారట. కొన్ని డిఫరెన్సెస్ వల్ల సూర్య ఈ మూవీని తిరస్కరించాడు. ఈ విషయాన్ని ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ బాధపడ్డాడు కూడా. సూర్య ఈ కథను తిరస్కరించడం బాధగా అనిపించిందని తెలిపారు.
ఆ తర్వాత 2015లో విక్రమ్ దగ్గరికి ఈ కథ వెళ్లడం.. వెంటనే పట్టాలకెక్కడం జరిగిపోయింది. దీని చిత్రీకరణ 2015 లోనే పూర్తయింది కానీ ఆర్థిక కారణాలవల్ల విడుదలకు మాత్రం నోచుకోలేదు. పలుమార్లు విడుదల చేస్తున్నామని ప్రకటించిన కూడా వాయిదా పడుతూ వచ్చింది.
ఈ మూవీ వల్ల తను, తన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతున్నామని చాలా సార్లు డైరెక్టర్ చెప్పుకొని బాధపడ్డాడు. ఎట్టకేలకు ఈ మూవీ విడుదలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.అందుకు కారణం మదగజరాజ విడుదలై కలెక్షన్లు పరంగా సంచలనాలను సృష్టించడమే.
తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. టైలర్ కూడా చిత్ర బృందం విడుదల చేసింది. దీనికిగాను ఆడియెన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో కూడా ఎక్కువగా కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఆ మూవీ స్ఫూర్తితో కచ్చితంగా రిలీజ్ చేస్తామన్న ధ్రువ నక్షత్ర మూవీ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








