Mother cut her Child’s throat : ఆడ బిడ్డను వద్దనుకుంది ఆ కిరాతక తల్లి. తనకు పుట్టిన పాపనే దారుణంగా చంపాలనుకుంది. గొంతు కోసి, చెత్తకుండీలో పడేసింది. ఇందుకు ఆమె తల్లి (పసికందు అమ్మమ్మ) సహకరించింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంత దారుణమా?
ఆడపిల్లలను ఇంటికి భారమని భావించి పుట్టుకతోనే చంపేసే ఘటనలు మన సమాజంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ ఇవి పెచ్చుమీరుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో గుండెను పిండేసేద దారుణం ఒకటి చోటుచేసుకుంది. ఓ తల్లి తన నెల రోజుల బిడ్డ గొంతును కోసి (Mother cut her Child’s throat) చెత్తకుండీలో పడేసింది. జనవరి 11న రాయ్‌గఢ్‌లోని ఒక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రక్తమోడుతుండగా …
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న పాపను 100 కి.మీ దూరంలోని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయానికి పాప గొంతు నుంచి రక్తం కారుతూనే ఉంది. ఆమెకు చుట్టిన బట్టలు రక్తంతో తడిసి ఎర్రగా మారాయి. వైద్యులు సత్వర వైద్యం అందించి పాపను కాపాడేందుకు పలు ఆపరేషన్లు చేశారు.
ఫలించిన వైద్యుల శ్రమ
వైద్యులు పసిపాప ప్రాణాలను కాపాడటానికి బాగా శ్రమించారు. పలు ఆపరేషన్లు చేసిన తెగిన సిరలు, నరాలు, ధమనులను తిరిగి అతికించి పాపను మృత్యువు నుంచి కాపాడారు. ఇది నిజంగా అరుదైన శస్త్ర చికిత్స. డాక్టర్లు చూపిన నైపుణ్యం, శ్రద్ధ, అంకితభావం, మానవతా దృక్పథం వైద్య రంగంలో విశేష గుర్తింపును తెచ్చి పెట్టింది.
‘పిహు’ అని నామకరణం
ఆ పాపను పోలీసులు ప్రభుత్వ శరణాలయానికి అప్పగించారు. అక్కడ ఆమెకు ‘పిహు (Pihu)’ అని పేరు పెట్టారు. ఇది ఆ పసిపాపకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆడబిడ్డ తనకు వద్దని చంపేందుకు తల్లి ప్రయత్నించినా మానవతం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఇదే నిదర్శం. ఈ ఘటనపైఐ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టి పాప తల్లిని, అమ్మమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








