Pramod Sarkar						
					
				
									
						ప్రమోద్ సర్కార్.. డిజిటల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్లైన్ జర్నలిజం, న్యూస్ కవరేజ్, కంటెంట్ మేనేజ్మెంట్, SEO ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు.
ప్రస్తుతం Sarkar Live వెబ్సైట్లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.					
				
							 
		
Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి
మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సభలు, ర్యాలీల్లో తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది. నీళ్లు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు సమావేశం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులు వివరణ ఇవ్వాలని కోరింది. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
నటుడు విజయ్ పర్యటనలు వాయిదా
ఈ ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పర్యటనలు ప్రారంభించినప్పటికీ, తొక్కిసలాట ఘటన కారణంగా తాత్కాలిక విరామం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
కాగా ఈ ఘటనపై రాజకీయ విమర్శలు, వాదోపవాదాలు తీవ్రతరం అవుతున్నాయి. విజయ్ అధికార డీఎంకేపై ఆరోపణలు చేస్తుండగా, డీఎంకే కూడా విజయ్‌పై కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ తొక్కిసలాట (Karur stampede)లో ఇప్పటి వరకు 41 మంది మృతులుగా ధృవీకరించారు. వారిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో 39 మంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Pramod Sarkar
More Posts
Khammam | సీపీఎం సీనియర్ నాయకుడి దారుణ హత్య
Read More »Warangal | రేపు వరంగల్‌లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే..
Read More »మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వర్షాలు – Montha Cyclone Update
Read More »Warangal Rains | భారీ వర్షంతో వరంగల్ అతలాకుతలం
Read More »Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారులకు సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు
Read More »Montha Cyclone | మొంథా తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు..
Read More »Cyclone Montha | తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం
Read More »Maoist | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ: కీలక మావోయిస్టు సరెండర్
Read More »Cyclone Montha | దడ పుట్టిస్తున్న ‘మొంథా’ తుఫాను – పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Read More »Web Stories
Gallery
Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ స్టిల్స్ – మిస్టర్ బచ్చన్ బ్యూటీ పిక్స్!
Ivana | టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ
Rajma | కిడ్నీ బీన్స్ ఎవరు తినకూడదు?
Recent Posts