Maha Kumbh Fire : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభామేళా పరిసరాల్లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభ్ నగర్ (Mahakumbh Nagar)లోని ఓ శిబిరంలో ఈ రోజు ఉదయం ఇది సంభవించింది. అప్రమత్తమైన అగ్నిమాక సిబ్బంది బాగా శ్రమకోర్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, చుట్టూ ఉన్న ఇతర శిబిరాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు.
ఎక్కడ జరిగింది ఈ ప్రమాదం?
మహా కుంభ్‌నగర్ (Mahakumbh Nagar) లోని సెక్టార్ 18-19 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో మేళా ప్రాంగణంలోని అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అనే విషయమై అధికారిక సమాచారం అందలేదు.
Maha Kumbh Fire కు కారణం ఏమిటి?
అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ మేళాలో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ సరఫరా సమస్యలు, భారీ సంఖ్యలో భక్తుల సమూహం వంటి అంశాలు ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో భక్తులు పాల్గొనే మహాకుంభా మేళాలో భద్రతను పటిష్ఠంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి టెంట్ వద్ద అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేయాలని, మేళా ప్రాంగణంలో ఎలక్ట్రికల్ వైర్లను తరచుగా తనిఖీ చేయాలని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని కట్టడి చేయాలని, భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కోరుతున్నారు.
అధికారుల సూచనలు
Mahakumbh Nagar మేళా ప్రాంగణంలో ఎక్కడైనా మంటలు చెలరేగితే వెంటనే భక్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. టెంట్లలో తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, పిల్లలు, వృద్ధులను ఎక్కువగా జనసందోహం ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాని అంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా అధికారులకు వెంటనే సమాచారం చేరవేయాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..