Maha Kumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరిగే మహా కుంభామేళా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సమ్మేళనమైన ఈ మహా కుంభామేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. గంగా, జుమునా, సరస్వతి నదుల సంగమం వద్ద ఆధ్యాత్మిక మహా వేడుక ప్రారంభం కానుంది.
యావత్ ప్రపంచమే అబ్బుర పడేలా..
మహా కుంభామేళా రేపటి (జనవరి 13) నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అశేష భక్త జనవాహిని మధ్య యావత్ ప్రపంచమే అబ్బురపడేలా అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ఆధ్మాత్మిక సమ్మేళనంలో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్లొననున్నారు.
పెరగనున్న జీడీపీ
మహా కుంభామేళా భారతీయ ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రేరణ ఇవ్వలగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి, జీడీపీ 1 % కి పైగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మహా కుంభామేళాలో సుమారు 40 కోట్ల మంది అంతర్జాతీయ, దేశీయ భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
రూ. 4 లక్షల కోట్ల వ్యాపారాలు
ప్రభుత్వ అంచనాల ప్రకారం 40 కోట్ల సందర్శకులు ఒకొక్కరు సగటున రూ. 5000 చొప్పున ఖర్చు చేస్తే ఈ మహా కుంభామేళాలో రూ. 2 లక్షల కోట్ల వ్యాపారాలు సాగుతాయయని అంచనా. అయితే… ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఈ ధార్మిక వేడుకలో భక్తులు ఒక్కొక్కరు సగటున రూ. 10,000 ఖర్చు చేయొచ్చు. తద్వారా ఆర్థిక ప్రభావం రూ. 4 లక్షల కోట్లను చేరుకోవచ్చు. మహా కుంభామేళాకు భారతీయ రైల్వేలు 1200 ప్రత్యేక ట్రైన్లను నడుపుతున్నాయి. అలాగే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Government of Uttar Pradesh) 6,000 బస్సులను అందుబాటులో ఉంచింది. ఇవే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపార సంస్థల భారీ లావాదేవీలు ఈ కుంభామేళా సందర్భంగా సాగనున్నాయి.
రూ. 300 కోట్లు ఆర్జిస్తామని అంచనా
దేశ విదేశాల కంపెనీలు మహా కుంభామేళాలో తమ వ్యాపారాలు చేసేందుకు పోటీపడుతున్నాయి. FMCG (ఫాస్ట్ మోవింగ్ కస్టమర్ గుడ్స్), ఔషధ రంగం, మోబిలిటీ సేవలు, డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ తదితర రంగాల్లో భారీగా మార్కెటింగ్ జరగనుంది. మహా కుంభామేళాలో రూ. 3,000 కోట్లకు పైగా అర్జించాలని ఈ రంగాలు అంచనా వేస్తున్నాయి.
భారీగా SAIL వ్యాపారం
ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) మహా కుంభామేళా కోసం సుమారు 45,000 టన్నుల ఉత్పత్తులను సరఫరా చేసింది. ఈ స్టీల్‌తో వివిధ నిర్మాణాలను తయారు చేయడమే కాక, రహదారుల మౌలిక సౌకర్యాలను కూడా మెరుగుపర్చారు.
Maha Kumbh Mela 2025 : దేశ విదేశాలకు ఆర్థిక ప్రయోజనం
మహా కుంభామేళా ద్వారా భారతదేశానికి మాత్రమే కాదు… ప్రపంచానికి కూడా ఆర్థికంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఆరు వారాలపాటు సాగే ఈ మేళా భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద భాగమైన పర్యాటక, రవాణా, వాణిజ్య రంగాలనూ ప్రేరేపిస్తుంది. ఈ వేడుకలో భాగస్వామ్యమయ్యే దేశ, విదేశీ భక్తులు, పర్యాటకులు, వ్యాపారులు, ప్రభుత్వాలు, వాణిజ్య రంగాల వారు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకారాన్ని అందించనున్నారు.
Maha Kumbh Mela 2025 కు సర్వాంగ సుందరంగా ప్రయాగ్‌రాజ్
ఈ అత్యంత ప్రసిద్ధ ధార్మిక మహోత్సవం కోసం ప్రయాగ్‌రాజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 200కి పైగా కొత్త రహదారులు ఇక్కడ నిర్మితమయ్యాయి. పాత రహదారులను కూడా అభివృద్ధి చేశారు. ఈ మెరుగుపడిన రోడ్లతో భక్తులు సులభంగా ఈ మహా కుంభామేళాలో చేరగలుగుతారు. అదేవిధంగా 3 లక్షల మొక్కలు, 1 లక్ష సాంకేతిక హార్టికల్చర్ నమూనాలను కూడా రహదారుల పక్కన ఏర్పాటు చేయగా నగర సౌందర్యం మరింత రెట్టింపు అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా భక్తుల విశ్వాసం
మహా కుంభామేళా ఒక సార్వత్రిక ధార్మిక, ఆధ్యాత్మిక ఉత్సవం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ విశ్వాసాలను పునః స్థాపించుకునేందుకు ఈ సమ్మేళానికి వస్తుంటారు. భారతదేశం ఈ విధంగా ఆధ్యాత్మికత, ఆర్థిక లాభాల పరంగా ఒక కొత్త మైలురాయిని చేరుకోనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 Comments
[…] ప్రయాగ్‌రాజ్ (Prayagraj) జరుగుతున్న మహాకుంభమేళా […]
[…] Komuravelli Jatara 2025 కాగా, మూడు నెలలపాటు సాగే ఐనవోలు […]