mahashivratri 2025 | మహా శివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. మీరు తెలంగాణ అంతటా ఉన్న ప్రముఖ శివాలయాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే. ఈ శివరాత్రి (Maha shivarathri ) సందర్భంగా మీరు సందర్శించగలిగే ఆలయాల జాబితాను ఇక్కడ మీకు అందిస్తున్నాము. ఒకసారి చూడండి.
రాజ రాజేశ్వర దేవాలయం, వేములవాడ

తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధమైన శైవక్షేత్రం వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ రాజ రాజేశ్వర స్వామి, స్థానికంగా రాజన్నగా ప్రసిద్ధి చెందారు. ఆయన రెండు వైపులా అలంకరించబడి కుడి వైపున శ్రీ రాజరాజేశ్వరి దేవి విగ్రహం, ఎడమ వైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహం ఉన్నాయి.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం

Kaleshwara Mukteswara Swamy Temple : భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ఆలయం అందరికీ తెలిసిందే.. ఒకే పీఠంపై కనిపించే రెండు శివలింగాల కారణంగా ఈ ఆలయం ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ లింగాలను శివుడు, యముడు అని పిలుస్తారు. సమిష్టిగా, వీటిని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అని పిలుస్తారు. త్రిలింగ దేశం లేదా “మూడు లింగాల భూమి”లో ప్రస్తావించబడిన మూడు శివాలయాలలో కాళేశ్వరం ఒకటి.
కీసరగుట్ట ఆలయం

కీసరగుట్ట ఆలయం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర గ్రామంలోని కీసరగుట్ట వద్ద శివుడు, పార్వతి అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఇది హైదరాబాద్ నుండి 30 కి.మీ, ECIL నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న కొండపై ఉంది. మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆలయం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
Maha shivarathri : రామప్ప ఆలయం

Ramappa Temple : రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలువబడే రామప్ప ఆలయం, భారతదేశంలోని తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటి. కాకతీయ శైలిలో నిర్మించిన ఈఆలయంలో అద్భుతమైన శిల్పసంపద ఆకట్టుకుటుంది. ఇది ములుగు నుంచి 15 కి.మీ, వరంగల్ నుంచి 66 కి.మీ, హైదరాబాద్ నుంచి 209 కి.మీ దూరంలో ఉంది. ఆలయంలోని ఒక శాసనం దీనిని 1213 CE సంవత్సరంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడని చెబుతుంది.
ఛాయా సోమేశ్వర ఆలయం

Chaya Someswara Temple : చాయ సోమేశ్వర స్వామి ఆలయం లేదా శైల-సోమేశ్వర ఆలయం అని కూడా పిలువబడే చాయ సోమేశ్వర ఆలయం, నల్గొండలోని పానగల్‌లో ఉన్న ఒక శైవ హిందూ దేవాలయం. ఇది 11వ శతాబ్దం మధ్యలో కుందూరు చోడుల (తెలుగు చోళుల శాఖ) పాలనలో నిర్మించబడింది.
కొమురవెల్లి మల్లన్న ఆలయం

Komuravelli Mallanna Temple : కొమురవెల్లి మల్లన్న ఆలయం అని పిలువబడే కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలోని ఒక కొండపై ఉంది. ఇది సిద్దిపేట సమీపంలో ఉంది. ప్రధాన దేవత మల్లన్న లేదా మల్లికార్జున స్వామి ఏటా సంక్రాతి నుంచి ఉగాది వరకు జాతర కొనసాగుతుంది.
ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం

ఐనవోలు : హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆరో విక్రమాదిత్యుడి మంత్రి అయ్యనదేవుడు క్రీ.శ 1076లో కట్టించాడని చరిత్ర చెప్తోంది. 108 స్తంభాలతో నిర్మితమైన ఈ శైవక్షేత్రం చాళుక్య రాజుల నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు మల్లన్న అవతారంలో భీకరమైన విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతీ మహా శివరాత్రి పర్వదినాన ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
త్రిలింగ సంఘమేశ్వర ఆలయం

శ్రీశ్రీశ్రీ త్రిలింగ సంఘమేశ్వర స్వామి ఆలయం కరీంనగర్ జిల్లాలోని విలాసాగర్ గ్రామంలో ఉంది. తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్న ఒకే ఆలయంలో మూడు గర్భగుడిలలో (గర్భ గృహం) మూడు లింగాలు ఉన్న ఏకైక పురాతన శివాలయాలలో ఇది ఒకటి. శ్రీ త్రిలింగ సంఘమేశ్వర స్వామి ఆలయం కరీంనగర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేములవాడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వేయి స్తంభాల ఆలయం

హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం లేదా రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. చారిత్రాత్మక దేవాలయం. ఇది శివుడు, విష్ణువు, సూర్యుడికి అంకితం చేయబడింది. వేయి స్తంభాల ఆలయం, వరంగల్ కోట, కాకతీయ కళా తోరణం, రామప్ప ఆలయంతో పాటు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..