Mahakumbh 2025 | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమైన మహాకుంభ్ ఈరోజు ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరిగిన కుంభమేళా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాగా 45 రోజుల్లో 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తెలిపారు. ఈ ఉత్సవాల కోసం యుపిలోని మహాకుంభ్ నగర్‌లోని తాత్కాలిక 76వ జిల్లాను పర్యవేక్షించడానికి యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, AI- ఆధారిత కెమెరాలతో సహా భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Mahakumbh 2025 : 66 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్-2025 (Mahakumbh 2025) లో మహాశివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా చివరి రోజు పవిత్ర స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు.జనవరి 13, పౌష్ పూర్ణిమ నుంచి నేటి ఫిబ్రవరి 26, మహాశివరాత్రి వరకు, ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభ్-2025లో మొత్తం 45 రోజుల్లో, 66 కోట్ల 21 లక్షలకు పైగా భక్తులు పవిత్ర త్రివేణిలో స్నానం చేశారు. ఇది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక సమ్మేళనమని, అపూర్వమైనది – మరపురానిది.” అని ముఖ్యమంత్రి X పోస్ట్‌లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








