Mahakumbh Mela 2025 : త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. మహా కుంభామేళా (Mahakumbh Mela) లో పాల్లొన్న కోట్లాది మంది భక్తులు అమృత స్నానం (Amrit Snan) చేయడంలో ఆ ప్రదేశమంతా మహా సందడిగా మారింది. ఈ పుణ్యస్నానాల ఘట్టం మూడు రోజులుగా సాగుతుండగా ఈ రోజు కూడా కోట్లాది మంది ఇందులో పాల్లొన్నారు.
పూల వర్షం కురిపించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) జరుగుతున్న మహాకుంభమేళా జనసంద్రంగా మారింది. దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తున్నారు. కుంభామేళాలో భాగంగా గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం వద్ద ఇప్పటికే 3.5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించారని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈ అమృత స్నానం మూడు రోజులుగా కొనసాగుతుండగా బుధవారం కూడా అశేష భక్తజనం దీనిని ఆచరించారని తెలిపింది. మంగళవారం అమృత్ స్నానం తర్వాత భక్తులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) హెలీకాప్టర్ నుంచి పూలు చల్లారు.
భద్రతా ఏర్పాట్ల నడుమ మహా కుంభామేళా
ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో 45 రోజుల పాటు భారీ భద్రత కల్పిస్తున్నారు. వేలాది మంది ఉత్తరప్రదేశ్ పోలీసులను ఇందుకు మోహరించారు. భారీ మేళా మైదానంలో వైమానిక నిఘా, జనసంద్రాన్ని పరిశీలించేందుకు 11 టెదర్డ్ డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌లను పోలీసులు వినియోగిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది భక్తులు వస్తుండటంతో డీజీపీ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఏటీఎస్ పారా కమాండో బృందాన్ని ఈ ప్రాంతంలో మోహరించారు. పుణ్య స్నానాలు ఆచరించేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా త్రివేణి సంగమం వద్ద భద్రతను పెంచారు.
Mahakumbh Mela : మహా కుంభామేళా.. ప్రాముఖ్యత
మహాకుంభమేళా వేల సంవత్సరాల నాటిది. పురాణాలు, మహాభారతం వంటి ప్రాచీన హిందూ గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. ఇది సముద్రమథనం అనే పురాణ కథలో దీని లోతైన విశ్లేషణ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహాజాతర. ఇందులో పాల్గొనేవారు తమ పాపాల నుంచి విముక్తిని పొందుతారు. తద్వారా మోక్షం పొందుతామని బలంగా నమ్ముతారు.
అమృత స్నానం చరిత్ర
మహాకుంభామేళా భారతదేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ప్రతి 12 సంవత్సరాలకోసారి దీనిని నిర్వహిస్తారు. భారతదేశంలోని నాలుగు పవిత్ర నగరాల్లో ఒకటైన ప్రయాగ్‌రాజ్‌లో ఇది జరుగుతుంది.
పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్రమంథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించిందని నమ్ముతారు. ఈ అమృతం భూమిపై నాలుగు చుక్కలుగా పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశంలోనే కుంభమేళా జరుగుతుంది. భక్తులు పాపాల నుంచి విముక్తి పొందడానికి, మోక్షం సాధించడానికి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తారు. ఈ మహాకుంభామేళా భక్తులలో ఆధ్యాత్మికతను పెంపొందుతుంది. వివిధ వర్గాల ప్రజలను ఒకచోట చేర్చి సామాజిక బంధాలను బలోపేతం చేస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..