మహారాష్ట్ర (Maharashtra) ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే ( Dhananjay Munde) తన పదవికి రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసు (sarpanch murder case)లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Chief Minister Devendra Fadnavis) ఆయనను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముండే ఈ రోజు తన రాజీనామాను సమర్పించారు.
Maharashtra : సర్పంచ్ హత్య.. సిండికేట్ క్రైం
డిసెంబర్ 9న మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని మసాజోగ్ గ్రామంలో జరిగిన హత్య కలకలం రేపింది. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ కొందరు దుండగుల చేతిలో హతమయ్యారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో పోలీసులు వాల్మికీ కరద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఓ క్రైం సిండికేట్‌ను నడుపుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
మంత్రి ముండేకు సంబంధం ఏమిటి?
వాల్మికీ కరద్ అరెస్ట్ అయిన తర్వాత అతడు మంత్రి ధనంజయ్ ముండేకు సమీప వ్యక్తి అనే వార్తలు వెలువడాయి. బీడ్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న వాల్మికీ కరద్‌ను మంత్రి ముండే సన్నిహితుడు బాలాజీ తండాలే కలవడం వివాదాస్పదమైంది. ఈ విషయం బయటకు రావడంతో ఈ హత్యలో బాలాజీ తండాలే ప్రమేయం ఉందని మృతుడు సంతోష్ దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే తన మంత్రి పదవికి ముండే రాజీనామా (resignation) చేయడం చర్చనీయాంశమైంది.
పెరిగిన రాజకీయ ఒత్తిడి
ఈ హత్య నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్సీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం గట్టి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ వివాదం ప్రభుత్వం పరువు తీస్తోందని భావించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముండేను తక్షణమే రాజీనామా చేయాలని సూచించారు. ఈ కేసును పూర్తిగా విచారణ జరిపించాలని, నేర సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర (Maharashtra) లో కీలక రాజీయ నేతగా ధనంజయ్ ముండేకు పేరుంది. 2019 ఎన్నికల్లో ఎన్సీపీ (NCP) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ తర్వాత బీజేపీతో కలసిపోయి మంత్రి పదవి చేపట్టారు. ఆయనపై హత్య ఆరోపణలు రావడంతో ఎన్సీపీ నేత శరద్ పవార్ వర్గం రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐ లేదా ఎన్‌ఐఏకు అప్పగించాలని యోచిస్తోందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








