Devendra Fadnavis | మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పుడు సీఎం ఎవరన్నది..? ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యమంత్రి పదవికోసం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis ), ఏక్‌నాథ్ షిండే ఇద్దరూ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు సీఎం అవుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహా తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే అజిత్ పవార్ (Ajit Pawar) మద్దతు తెలిపినట్లు సమాచారం.. ఆదివారం జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం.
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి ఏకంగా 235 సీట్లు గెలుచుకొని భారీ విజయం కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. అయితే అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్ ఫిగర్ కాగా, బీజేపీ దానికి ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎంగా షిండేనే కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు మరో 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది.
నేడు సీఎం ప్రమాణ స్వీకారం
మరోవైపు నేడు మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని శివసేనకు చెందిన మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. తొలి విడుతలో ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు వీరు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చు. ఇందులో బీజేపీ నుంచి 21, శివసేన (షిండే) పార్టీ నుంచి 12, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం లభించవచ్చని తెలుస్తున్నది.
3 thoughts on “Devendra Fadnavis| మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్..?”