Eknath Shinde | మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీసే ఖాయంగా తెలిసింది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde).. డిప్యూటీ సీఎంగా (Deputy Chief Minister) బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మహారాష్ట్రలో డిసెంబర్ 5న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారని జాతీయ మీడియా పేర్కొంటోంది.
ఇదిలా ఉండగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) రికార్డు స్థాయిలో సీట్లనుగెలుచుకొని భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. కూటమిలో బీజేపీ 132 సీట్లు, షిండే సేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించాయి. ఈ క్రమంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలుస్తోంది. అయితే, ఇందుకు షిండే వర్గం అలబూనినట్లు పలువురు భావిస్తున్నారు. ఆయనను సముదాయించే కారణంగానే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
One thought on “Eknath Shinde | ఏక్ నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి?”