Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మహిళ తన కూతురిని చంపి, ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో రేబిస్ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకిందని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది. బంధువులు చెప్పారని చెట్ల (నాటు వైద్యం) మందులు సైతం వాడమని భర్తను కోరింది. ఆమె చెప్పినట్లుగానే భర్త నరేష్ కూడా నాటు వైద్యం మందులు వాడటం ప్రారంభించాడు. రేబిస్ వ్యాధి సోకిందని చాలా రోజుల నుంచి యశోధ మానసికంగా కుమిలిపోతోందని భర్త తెలిపాడు. రేబిస్ వ్యాధి పై యూట్యూబ్ లోనూ వెతికేదని, పిల్లలు జాగ్రత్త అని తరచూ తనకు చెబుతుండేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యశోద తన కూతురిని చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.