- ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మహిళా శక్తి క్యాంటీన్ పేరిట మోసం
- నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ వ్యక్తి ఆ క్యాంటీన్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం
- మహిళా శక్తి క్యాంటీన్ ను ఆ వ్యక్తి కి అప్పగించడం వెనుక ఓ మాజీ “ఏవో” హస్తం ఉన్నట్లు ప్రచారం?
Mahila Shakti Canteen : మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని (Mahila Shakti Scheme) అమలులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించి మహిళల అభ్యున్నతి కోసం కృషిచేస్తుంది.అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మహిళా శక్తి క్యాంటీన్ ను ఓ” మోడల్ రైతు చికెన్ బజార్” ఓనర్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పేరు మహిళా శక్తి క్యాంటీన్ ది … నిర్వహణ మాత్రం “ఎంఆర్సిబి” ఓనర్ ది..?
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న మహిళా శక్తి క్యాంటీన్ ను నిబంధనలకు విరుద్ధంగా “ఎం ఆర్ సి బి” ఓనర్ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మహిళా శక్తి క్యాంటీన్ పేరుతో బోర్డ్ లు బహిర్గతంగా ఏర్పాటు చేసి సదరు ప్రైవేట్ వ్యక్తి జిల్లా కలెక్టర్ ను సైతం బోల్తా కొట్టిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. మహిళలు ఆర్ధికంగా ఎదగాలని ప్రభుత్వం మహిళా క్యాంటీన్ లు ప్రారంభిస్తే వరంగల్ జిల్లాలో మాత్రం ప్రైవేట్ వ్యక్తి ఎదుగుదలకు మహిళా శక్తి క్యాంటీన్ ఉపయోగపడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Warangal Mahila Shakti Canteen : మాజీ “ఏవో” హస్తం ఉందని ప్రచారం..?
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ( Indira Mahila Shakti Canteen : మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారా?) ను నిబంధనలకు విరుద్ధంగా మోడల్ రైతు చికెన్ బజార్ ఓనర్ నిర్వహించడం వెనుక వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవలి కాలంలో” ఏవో” గా విధులు నిర్వహించిన ఓ అధికారి హస్తం ఉందని తెలుస్తోంది. సదరు ప్రైవేట్ వ్యక్తి తనకు ఆ అధికారి పూర్తిగా సహకరించడంవల్లే క్యాంటీన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాని తన సహచరులతో ఆ అధికారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.”ఎం ఆర్ సి బి” ఓనర్ మహిళా శక్తి క్యాంటీన్ ను నిర్వహించేందుకు సహకరించిన సదరు మాజీ “ఏవో” కు ముడుపుల రూపంలో గట్టిగానే ముట్టినట్లు ఆరోపణలు లేకపోలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








