Major blaze : ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate -ED) ప్రధాన కార్యాలయం ఈ రోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదానికి గురైంది. కైసరె హింద్ భవనంలో ఉన్న ఈ (ED office building) ఆఫీసులో మంటలు ఒక్కసారిగా (major blaze broke out) చెలరేగాయి. నాలుగో అంతస్తులో మొదలైన భవనమంతటా వ్యాపించాయి. కొద్ది నిమిషాల్లోనే భయంకర స్థాయికి చేరాయి. ఎనిమిది అగ్ని శకటాల (fire engines) ద్వారా మంటలను అదుపు చేసే యత్నం చేసినా (firefighting operations) ఫలితం దక్కలేదు. కొన్ని గంటలపాటు శ్రమించినా బిల్డింగ్‌ను కాపాడలేకపోయారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని కీలక రికార్డులన్నీ కాలిపోయాయని తెలుస్తోంది.
Major blaze : లెవల్ -III తీవ్రత
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) ప్రధాన కార్యాలయంలో సంభవించిన అగ్నిప్రమాద తీవ్రతను ఫైర్ బ్రిగేడ్ అధికారులు Level -IIIగా ప్రకటించారు. ఈ స్థాయి ప్రమాదాన్ని చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. భవనం లోపల కరెంటు తీగలు సరిగా లేక షార్ట్‌సర్యూట్ సంభవించడం, గాలి ప్రసరణలో లోపాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.
ఎంత శ్రమించినా ఫలితం శూన్యం
ఈడీ (Enforcement Directorate-ED) కార్యాలయంలో మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేశారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు, 6 జెట్ స్ప్రేయర్లతోపాటు పలు వాటర్ ట్యాంకర్లు, ఇతర ఫైర్ ఫైటింగ్ పరికరాలను రప్పించారు. మంటల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. ఫైర్ ఫైటర్లు తీవ్రమైన పొగను, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆరు గంటలకు పైగా నిరంతరం శ్రమించారు. ఆఫీసులో ఉన్న పలు గదులకు మంటలు వ్యాపించడంతో వాటిని అదుపు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Major blaze : డాక్యుమెంట్లన్నీ బుగ్గిపాలు!
ఈడీ కార్యాలయంలో కీలకమైన కేసులతో సంబంధం ఉన్న ఫైళ్లు, డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయని తెలుస్తోంది. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలు దహనమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని కీలక విచారణలకు సంబంధించిన ఆధారాలు దహనమయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన సమయానికి కార్యాలయంలో పెద్దగా సిబ్బంది లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు.
కీలక కేసుల విచారణలపై ప్రభావం?
కైసరె హింద్ భవనం ముంబయి బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఒక పాత, చారిత్రాత్మక భవనం. ఇది ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉపయోగించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఈడీ (Enforcement Directorate-ED) కార్యాలయం కూడా ఉంది. ముఖ్యమైన ఫైళ్లు, కేస్ డేటాలు, విచారణ డాక్యుమెంట్లను ఈ బిల్డింగ్‌లో భద్రపరుస్తారు. ఈ ప్రమాదం వల్ల కొన్ని కీలక కేసుల విచారణలపై ప్రభావం పడొచ్చని నిపుణులు అంటున్నారు.








