Mallareddy Controversy : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (BRS MLA Mallareddy) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన ఆయన హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో దీని వీడియోలు వైరల్‌గా (Mallareddy Viral Video) మారింది. మల్లారెడ్డి ఇలా అనుచితంగా మాట్లాడటం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు (Women Organization), సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Mallareddy Controversy : అసలేం జరిగిందంటే?
ఓ సినిమా ఆడియో లాంచ్ (Audio Function)కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డిని ఆహ్వానించారు. స్టేజ్ పైకి వెళ్లిన ఆయన మైక్ తీసుకుని మాట్లాడుతున్న సందర్భంలో హీరోయిన్ కసీ కపూర్ (Kasi Kapoor) గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. కసికసిగా ఉంది’ అని వ్యాఖ్యానించడంతో ఈవెంట్‌కి వచ్చిన ప్రేక్షకులు, హీరో, ఇతర అతిథులు నవ్వేశారు. కానీ ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళా సంఘాల ఆగ్రహం
మహిళల గురించి మల్లారెడ్డి (Mallareddy) అగౌరవకరంగా మాట్లాడడం చాలా బాధాకరం అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం అసహ్యంగా ఉందని కొందరు రాజకీయ నేతలు కూడా మండిపడుతున్నారు. మరికొందరు సినిమా ఈవెంట్లలో ఇలాంటి అసభ్యమైన వ్యాఖ్యలు పెట్రేగిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు (Social Media Criticism) వస్తున్నాయి.
అసెంబ్లీ వదిలిపెట్టి సినిమా ఫంక్షన్‌కు..
మల్లారెడ్డి తన ప్రసంగంలో మరో వివాదాస్పద వ్యాఖ్య (Mallareddy Controversy) కూడా చేశారు. ‘సినిమా షూటింగ్ సమయంలో నన్ను పిలిచారు. కానీ రావడం కుదరలేదు. ఈరోజు మాత్రం అసెంబ్లీకి డుమ్మా కొట్టి (Assembly Absence) కూడా వచ్చేశా’ అన్నారు. ఈ వ్యాఖ్యపై కూడా విస్తృత స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఎమ్మెల్యేలు ఇలా సినిమా ఫంక్షన్లకు హాజరవడం సబబేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మల్లారెడ్డిపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మల్లారెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్టేజ్ మీద మహిళలను ఇలా తక్కువ చేసి మాట్లాడడం అత్యంత దౌర్భాగ్యమని, సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా మల్లారెడ్డి మన్నించలేని తప్పు చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Mallareddy Controversy : కొత్తేమీ కాదు?
ఇది మల్లారెడ్డికి సంబంధించిన మొదటి వివాదం (Mallareddy Controversy) కాదు. గతంలో కూడా ఆయన వివిధ సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాల కారణంగా ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మల్లారెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తాాజా తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








