భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల
గ్రేటర్ వరంగల్ (Warangal)లోని మామునూరు విమానాశ్రయం (Mamnoor Airport) నిర్మాణంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రాంమోహన్ నాయుడు ఈ మార్చిలో అనుమతిచ్చారు. ఈమేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ప్రతిపాదనపై సంతకం కూడా చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ (Mamnoor Airport) నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేయడంతో వరంగల్ నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.