Man eating Tiger | పెద్ద పులి దాడులతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (wayanad) జిల్లా ఇటీవల వార్తల్లో నిలిచింది. మనంతవాడి (Mananthavady) సమీపంలోని కాఫీ తోటల్లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మహిళను పెద్దపులి దాడి చేసి చంపడం కలకలం రేపింది. నరమాంసం తిన్న ఆ పెద్దపులి ఆ తర్వాత వరుస దాడులకు పాల్పడటం మరింత భయాందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఆ పులిని కేరళ ప్రభుత్వం మ్యాన్ ఈటర్ (Man eating Tiger)గా ప్రకటించి, దానిని సురక్షితంగా పట్టుకొనేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది.
ముమ్మర గాలింపుల తర్వాత..
పెద్ద పులి దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు కేరళ అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పులిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమీప అడవుల్లో గాలించారు. చివరకు ఆ పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించారు.
మరో క్రూర మృగం చేతిలో…
అడవిలో పెద్ద పులి కనిపించిందని నిన్న (ఆదివారం) పలువురి ద్వారా తెలుసుకున్న ఫారెస్టు అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి బయల్దేదారు. అక్కడికి వెళ్లి చూడగా ఆ మ్యాన్ ఈటర్ మృతి చెంది ఉంది. దీనిపై ఈ రోజు (సోమవారం) ఫారెస్టు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మనుషులపై దాడులు చేస్తున్న పెద్ద పులి మృతి చెందిందని వెల్లడించారు. పులి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. అది మరో క్రూర మృగం దాడికి గురై మరణించి ఉండొచ్చని వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా అభిప్రాయపడ్డారు.
Man eating Tiger in kerala : భయాందోళలను కలించి..
మనంతవాడి సమీపంలో కాఫీ తోటలో పని చేస్తున్న రాధా అనే మహిళపై ఈ పులి దాడి చేసింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం కొంత భాగాన్ని పులి తినేసింది. ఇదే కాకుండా అటవీశాఖ అధికారి జయసూర్యపై కూడా దాడికి పాల్పడింది. వరుస దాడులతో నరమాంసం తినడానికి అలవాటు పడిన ఈ పులి ప్రజలలో తీవ్ర భయాన్ని రేకెత్తించింది. పులి దాడులు ఎక్కువ కావడంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. ఎటువంటి శబ్దం వచ్చినా ఉలికిపడ్డారు. చివరకు ఆ మ్యాన్ ఈటర్ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇదే క్రమంలో పులి సజీవంగా ఫారెస్టు అధికారులకు దొరికి ఉంటే దానికి రక్షణ ఉండేదని జంతు ప్రేమికులు అంటున్నారు. తద్వారా అంతరించుకుపోతున్న వన్యప్రాణాలను కాపాడుకొనే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అడవుల నుంచి బయటకు రావడం వల్లే ఆ పులి ప్రజలపై దాడి చేసిందంటున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా టైగర్ జోన్లు ఏర్పాటు చేసి పులలకు రక్షణ కల్పిస్తూనే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివరకు ఇలా…”