Manchu Manoj : సినీ నటుడు మంచు మనోజ్‌ను తిరుపతి (Tirupati) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఆయన్ను బాకారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుకు సంబంధించిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. చంద్రగిరి నియోజకవర్గం ( Chandragiri constituency)లో నిర్వహించిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ (Actor Manchu Manoj), ఆయన భార్య భూమా మౌనిక హాజరయ్యారు. చంద్రగిరి మండలంలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఈ ఉత్సవం జరిగింది. ఇందులో మంచు విష్ణు తన భార్యతో కలిసి పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా Manchu Manoj
జల్లికట్టు (Jallikattu) అనేది సంప్రదాయ క్రీడ. ఇందులో ఎద్దును జనసమూహంలోకి వదులుతారు. ఈ ఆటలోల పాల్గొనేవారు ఎద్దు కొమ్ములను పట్టుకుని దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎద్దును ఆపడం లేదా దాని కొమ్ముల నుంచి జెండాలను తీసేయడం అనే లక్ష్యంతో ఈ క్రీడ సాగుతుంది. ఈ వేడుకలకు మంచు మనోజ్ (Manchu Manoj) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డప్పులు, బాణసంచా, గజమాలతో మనోజ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి జల్లికట్టు పండుగ జరుగుతూనే ఉందని, ఇది సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో 20 ఏళ్లుగా జల్లికట్టు జరగడం గొప్ప విషయమని అన్నారు. తమిళనాడు జల్లికట్టుతో పోలిస్తే ఇక్కడి వేడుకలు సాఫ్ట్‌గా ఉంటాయని, పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా భక్తితో జరుపుకుంటామని తెలిపారు..
Manoj కుటుంబంలో ఆస్తి గొడవ
ఇటీవల మంచు మనోజ్‌కు ఆయన తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో ఆస్తి వివాద నడుస్తోంది. ఈ గొడవ హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్, కోర్టు వరకు వెళ్లింది. తాజాగా ఈ వివాదాలు తిరుపతికి చేరుకున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఓ ఘటన జరిగి గందరగోళం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇది సద్దుమణిగింది.
వివరాలు వెల్లడించని పోలీసులు
తాజాగా తిరుపతికి వచ్చిన మంచు మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయనను బాకారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే..ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపైఐ బాకారావుపేట పోలీసులు అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..