Manchu Manoj : ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో స్వర్గం నరకం చిత్రంతో నటుడుగా మారారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. చాలా సినిమాల్లో విలన్ గా చేసినా ఆ తర్వాత నటుడిగా నిలదొక్కుకుని హీరోగా మారారు. కొన్ని సినిమాలు చేశాక తనే నిర్మాతగా మారి దాదాపు 75 సినిమాలను నిర్మించారు. తిరుపతిలో ఒక స్కూల్ ని స్థాపించి విజయవంతంగా నడిపించారు.
ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు (Mohan Babu) అని చెబుతుంటారు. అయితే కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ లో గొడవలు తారా స్థాయికి చేరాయి. అన్ని గొడవలు సద్దుమనిగాయి అనుకున్న తరుణంలోనే మళ్లీ కొత్త వ్యవహారంతో మలుపులు తీసుకుంటుంది.
మంచు మనోజ్ యూనివర్సిటీకి వచ్చి హల్చల్ చేయడం, దానిపై మోహన్ బాబు రియాక్ట్ అయి అతనిపై ఫిర్యాదు చేయడం, మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పి పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు పై ఫిర్యాదు చేయడం ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొని ఇంటి వ్యవహారాలను వీధిలో పెట్టారు. దీనిపై అభిమానులు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.
కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకుని మోహన్ బాబు ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తే కొడుకులుగా దానిని కాపాడాల్సింది పోయి మోహన్ బాబును అలా నడివీధిలోకి లాగడం ముమ్మాటికి మనోజ్ తప్పే అని కొందరు అంటున్నారు. ఇంకా చాలామంది మనోజ్ చేసింది నూటికి నూరుపాళ్ళు సరైనదే అని మద్దతు పలుకుతున్నారు. ఇలా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
రీసెంట్గా రౌడీ సినిమాలోని ఒక డైలాగును మంచు విష్ణు ట్వీట్ చేశారు. అది మనోజ్ ను ఉద్దేశించే చేశారని మనోజ్ అభిమానులు , అది పెట్టిన కొద్దిసేపటికే మంచు మనోజ్ కూడా కృష్ణంరాజు నటించిన కొన్ని సినిమాలను ట్వీట్ చేస్తూ కౌంటర్ వేయడం అది విష్ణుని ఉద్దేశించే చేశారని విష్ణు అభిమానులు అనుకుంటున్నారు. దీంతో మళ్లీ అగ్గి రాజేసుకున్నట్టయింది.
ఇదిలా ఉండగా తాజాగా మోహన్ బాబు తను కష్టపడి సంపాదించిన ఆస్తి ఎవరు అనుభవించడానికి వీలులేదని, అందులో ఎవరు ఉన్న ఖాళీ చేయించాల్సిందిగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు వచ్చేలా చూడాలని కోరారు. దీనిపై మంచు మనోజ్ (Manchu Manoj ) వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా ఒక స్టార్ హీరో ఫ్యామిలీ ఇలా గొడవలు పడడం చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలోనే గొడవలకు పులిస్టాప్ పెట్టి కలిసుండాలని కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








