Mazaka movie review | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), రీతు వర్మ (Reethu Varma) హీరో హీరోయిన్లుగా మన్మధుడు ఫేమ్ అన్షు(Aanshu), రావు రమేష్ (Raavu Ramesh) ముఖ్యమైన పాత్రల్లో ధమాకా హిట్టు తర్వాత త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao nakkina) డైరెక్షన్ లో వచ్చిన మూవీ మజాకా (Mazaka). ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. ఇందులో నటీనటులు ఏ విధంగా పర్ఫామెన్స్ చేశారు. ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పించిం దనేది చూద్దాం….
మూవీ కథ విషయానికి వస్తె తండ్రి రమణ (రావు రమేష్) తన కొడుకు కృష్ణ కి (సందీప్ కిషన్) సంబంధాలు చూస్తుంటాడు. కృష్ణ చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు లేరని ఎవరూ కూడా పిల్లని ఇవ్వడానికి ముందుకు రారు. ఇక రమణ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకావిడ (అన్షు) పరిచయమవుతుంది. ఇక్కడ కృష్ణ కూడా ఒక అమ్మాయిని(రీతు వర్మ)లవ్ చేస్తాడు.ఇద్దరు ఒకేసారి ప్రేమలో పడ్డ తండ్రి కొడుకులు వారినే పెళ్లి చేసుకున్నార…తర్వాత ఏం జరిగింది అనేది కథ…
Mazaka movie review మూవీ ఎలా ఉందంటే….
ఎంటర్టైన్మెంట్ జానర్లో వచ్చిన మూవీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఏ రేంజ్ హిట్టు పడుతుందొ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో చూశాం. ఎంటర్టైన్మెంట్ నే ప్రధానంగా త్రినాథ రావ్ నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబో పెద్దపీట వేస్తారు. ఈ మూవీ ని కూడా అలాగే నడిపించారు.ఫస్ట్ ఆఫ్ ని కామెడీ తో కట్టిపడేయాలనుకున్నారు. అనుకున్న ప్రకారం సీన్లు మాత్రం అంత నవ్వుకునెలా రాసుకోలేదు. ఇంటర్వెల్ వరకు బోర్ కొట్టేలా ఉండదు కానీ ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఆ సీన్లు ఉంటే బాగుండేదేమో అనిపించింది. రావు రమేష్ లవ్ ట్రాక్ తో కొంచెం ఫన్ క్రియేట్ చేసినా మిగితా సీన్లు కంటిన్యూ చేయలేకపోవడం ఫస్ట్ ఆఫ్ లో మైనస్ గా మారింది. ఇక సెకండ్ ఆఫ్ లో సాగదీత సీన్లు ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. అన్షు ఫ్లాష్ బ్యాక్ అంత ఎఫెక్టీవ్ గా లేదు. ఒక్క రావు రమేష్ ఎమోషన్స్ సీన్స్, క్లైమాక్స్ తప్ప సెకండ్ ఆఫ్ ఏది కూడా అంతలా అనిపించదు.మొత్తంగా మూవీ ఫస్ట్ ఆఫ్ బోర్ కొట్టని విధంగా ఉన్నా సెకండ్ ఆఫ్ సోసో గానే ఉందని చెప్పొచ్చు.
టెక్నీషియన్స్ , నటీనటుల పనితీరు…
త్రినాధ రావు నక్కిన, రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ జానర్లోనే ఉంటాయి. దానితోనే ఇప్పటివరకు వారు సక్సెస్ లు చూశారు. మూవీ పాయింట్ కొత్తది తీసుకున్నా ప్రెజెన్టేషన్ చేయడంలో కొంతవరకు తడబడ్డారని అనిపించింది. కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకెళ్లడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అక్కడక్కడ కామెడీ సీన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా రాసుకోలేకపోయారు.అదే మైనస్ గా మారింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ తర్వాత సందీప్ కిషన్ ఆ రేంజ్ లో కామెడీ ని పండించారు. సందీప్ కిషన్ తండ్రిగా యాక్ట్ చేసిన రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన కామెడీని చేయగలడు.. ఎమోషన్స్ ని కూడా అంత బాగా పండించగలరని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మురళి శర్మ యాక్టింగ్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇక మన్మధుడు ఫేమ్ అన్షు చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించి అదే రేంజ్ లో ఆకట్టుకుంది. రీతు వర్మ కూడా కీలకమైన పాత్రలను నటించింది. మిగితా నటీనటులు వారి పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు. ఈ మూవీలో లియోన్ జేమ్స్ అందించిన పాటలు ఒకటి రెండు మినహా అంత ఆకట్టుకునే విధంగా లేవనే చెప్పొచ్చు. బిజిఎం లో కొంత వరకు మెప్పించాడు. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి ఈ మూవీ (Mazaka movie review) ఎలా ఉందంటే మజాకా ఆడియన్స్ కి ఫుల్ మజా ఇవ్వలేదని చెప్పొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








