మీ సేవ కేంద్రాల్లో (Mee Seva Centers) మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ విలువ సర్టిఫికేట్ వంటి సేవలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Duddilla Sridhar babu) సోమవారం అధికారికంగా ప్రారంభించారు. దీనిపై సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన తాజా సేవల తీరును పరిశీలించారు. ఇకపై మ్యారేజీ రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇకపై దరఖాస్తుదారులు స్లాట్ బుకింగ్ ద్వారా ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. పెళ్లి తాలూకు ఫొటోలు, చిరునామా, వయస్సు రుజువులతో పాటు అవసరమైన పత్రాలు సమర్పిస్తే, ధ్రువీకరణ అనంతరం సర్టిఫికేట్‌ను ప్రత్యక్షంగా ఎస్ఆర్వో కార్యాలయంలో పొందవచ్చు.
Mee Seva : భూముల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్ కూడా..
భూముల తాజా మార్కెట్ విలువ తెలుసుకోవాలంటే ఇక చాలా సులువు. మీ సేవ కేంద్రం (Mee seva centers) లేదా ఆన్‌లైన్‌లో జిల్లా, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేస్తే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం 24 గంటల్లోపు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. భవనాలు, అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. . ఈ సేవలతో ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందుతాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలు ఇక సులభంగా సేవలు పొందగలుగుతారు. నిర్మాణ రంగం, స్థిరాస్తి వ్యాపారాల్లో ఈ సర్టిఫికేట్లు కీలకమైన పత్రాలుగా మారనున్నాయని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.