Megastar Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి రారాజుగా వెలుగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 90 వ దశకంలో ఆయన సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ థియేటర్లకి ఎగబడే వారు. అలాంటి క్రేజ్ ని మెగాస్టార్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. మెగాస్టార్ డాన్సులు, ఫైట్లతో ఆడియన్స్ పిచ్చెక్కిపోయేవారు. ఇంటర్వెల్లో కూడా సీట్లలోనే కూర్చునేవారంటే మెగాస్టార్ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఉర్రూతలూగించిన ముఠామేస్త్రీ
చిరంజీవి, కోదండ రామిరెడ్డి (Kodandarami Reddy ) కాంబినేషన్ లో ఖైదీ, రాక్షసుడు, అభిలాష, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, విజేత ఇలా దాదాపు 22 సినిమాలు వచ్చి అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ మూవీ చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. 1993 జనవరి 17న వీరి కాంబినేషన్లో ముఠామేస్త్రి (Muta mestri) సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. ఇదే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి మూవీ.
మ్యూజిక్ డైరెక్టర్ కోఠి పాటలు ఇప్పటికీ ఫేమస్. అందులో ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ ఇప్పటికీ కూడా పెళ్లిల్లో, ఫంక్షన్లలో, స్టేజీ ల మీద డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యమంత్రి పాత్రలో చిరంజీవి నటించిన తీరు, మూవీలో ఆయన డాన్సులు, మీనా,రోజా గ్లామర్ తో ఈ మూవీ సూపర్ హిట్టు గా నిలిచిపోయింది.
ఇప్పటికీ కూడా మెగా అభిమానులకు (Megastar Chiranjeevi Fans ) ఇది ఒక స్పెషల్ మూవీ. సినిమా వచ్చి 32 సంవత్సరాలు దాటిపోయిన మూవీలో మెగాస్టార్ వేసిన స్టెప్పులు ఇప్పటి డ్యాన్సర్లు ఇమిటేట్ చేస్తుంటారు. పరుచూరి బ్రదర్స్ ఆయన పాత్రకు రాసిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. స్పీడ్ అయిపోమాకు స్టోరీ మారిపోద్ది… లాంటి డైలాగ్స్ ని ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోరు. ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఆయనను ఇమిటేట్ చేస్తూ ఆ డైలాగ్స్ ని వాడుతూనే ఉంటారు.
మూవీలో పరుచూరి గోపాలకృష్ణ ( Paruchuri Gopala Kishana ) చేసిన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. చిరంజీవి, పరుచూరి గోపాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సీన్లను ఆడియన్స్ తెగ చేశారు. తెలంగాణ యాసలో వీరు డైలాగ్స్ చెప్పి అదరగొట్టారు. ఈ స్పెషల్ మూవీ ఈరోజుతో 32 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్లో మరొక మూవీ రాలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.