చిరు -వశిష్ట (chiru- vashishta) కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా వస్తున్న మూవీ విశ్వంభర (Vishvambhara). ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతికే ఈ మూవీ రిలీజ్ అవ్వనుండగా గేమ్ చేంజర్ మూవీ లైన్లోకి వచ్చింది. ఈ మూవీతో విశ్వంబర వేసవికి వాయిదా పడింది. ఇక ఈ ప్రాజెక్టు విషయానికొస్తే రోజుకో రూమర్ వినిపిస్తోంది.
మొన్నటివరకు ఈ మూవీ వీఎఫ్ఎక్స్ విషయంలో చిరు (Megastar Chiranjeevi) వినాయక్ ని (vv vinayak) రంగంలోకి దించాడని తెలిసింది. ఆ మధ్య విశ్వంభర మూవీ గ్లింప్స్ ని విడుదల చేయగా దాంట్లో వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ నాసిరకంగా ఉందని, క్వాలిటీగా ఉండాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి కూడా విమర్శలు వినిపించాయి. దీనిపై చిరు సీరియస్ గానే తీసుకున్నారు. ఈరోజుల్లో వస్తున్న సినిమాలను ప్రపంచమంతా చూస్తుంది కాబట్టి వీఎఫ్ ఎక్స్ విషయంలో ఏమాత్రం తేడా కొట్టిన సినిమాపై ఎఫెక్ట్ గట్టిగానే పడుతోందని తెలుసు. అందుకే హై క్వాలిటీ గా ఉండేట్లు చూసుకుంటున్నారు డైరెక్టర్ వశిష్ట.
ఆయన మొదటి సినిమా బింబిసారలో కూడా వీఎఫ్ ఎక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టలేదని విమర్శలు వచ్చాయి. విశ్వంభర (Vishvambhara Movie) లో కూడా అలా కంటిన్యూ అవ్వడంతో చిరు కోరిక మేరకే మొదట వినాయక్ ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఆ రూమర్స్ అలా ఉండగా ఇప్పుడు కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.
మహానటి, కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) వీఎఫ్ఎక్స్ పై వర్క్ చేస్తున్నట్లు టాక్ వినబడుతొంది. కల్కి మూవీలో వీఎఫ్ఎక్స్ విషయంలో శ్రద్ధ చూపిన నాగ్ అశ్విన్ ఈ మూవీకి వర్క్ చేయడం ప్లస్ పాయింట్ అని కొందరు అంటుండగా.. మరి కొందరు బింబిసార లాంటి హిట్ ఇచ్చిన వశిష్టను ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని కొందరు అనుకుంటున్నారు. చిరు మాత్రం సినిమా బాగా రావడానికి ఏదైనా చేయొచ్చని.. డైరెక్టర్ ని ఒప్పించే ఈ డైరెక్టర్ లని రంగంలో కి దించినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇలాంటి ప్రయోగాలు చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
Vishvambhara : సోషియో ఫాంటసీ చిత్రంగా..
ఇదిలా ఉండగా జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ తర్వాత చిరు నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇదే. ఈ మూవీ మే 9న రిలీజ్ అయి అఖండ విజయం సాధించింది. అదే రోజున విశ్వంభర ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూవీ టీమ్ మాత్రం విశ్వంభ రను బంపర్ హిట్టు చేయాలని ఆలోచనలోనే ఉన్నారు. చిరు కెరీర్ లోనే నిలిచిపోయేలా చేస్తామని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియన్ మూవీ గా వచ్చినా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో చిరు ఈ మూవీని ప్రెస్టేజ్ గా తీసుకొని నటిస్తున్నారు. చూడాలి మరి చిరు కెరీర్ లో ఈ మూవీ ఎలా నిలిచిపోతుందో…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









2 Comments
[…] దీంతో చౌదరి అప్పులపాలయ్యారు. సినీ రంగంలో ఎంతో మంది నిర్మాతలు పెట్టుబడులు […]
[…] చిరు విశ్వంభర సెట్స్ మీద ఉంది. రెండు పాటలు మినహా […]