Vishwambhara Glimpse Release | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర ( Vishwambhara) నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొన్ని నెలల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ కి నెగెటివ్ టాక్ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. అప్పటి నుండి ఈ మూవీ గురించి అప్డేట్స్ ఇవ్వడంలో మేకర్స్ సైలెంట్ అయ్యారు.
చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేసారు. దీంతో నెగిటివిటీని పోగొట్టాలని చూసిన మేకర్స్ కి అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. కీరవాణి(keeravani)మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో సాంగ్స్ పై భారీ హోప్స్ పెట్టుకున్నారు.రిలీజ్ చేసిన సాంగ్ అదిరిపోతుందనుకున్న ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేకపోవడం తో మరింత నెగెటివిటీ ని మూటగట్టుకుంది.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో పోస్ట్ పోన్ చేశారు.ఇది ఒకందుకు మూవీ కి ప్లస్ అయిందని చెప్పొచ్చు. వీఎఫ్ ఎక్స్ పై కూడా నెగటివిటీ రావడంతో సరిదిద్దుకునే పనిలో పడింది మూవీ టీం. చిరు ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అయ్యారు.రోజులు గడుస్తున్న డైరెక్టర్ వశిష్ట (vasishta)ఏ అప్డేట్ ఇవ్వడం లేదంటూ గుర్రుగా ఉన్నారు.
చిరుకి బర్త్ డే ట్రీట్ అదిరింది…
ఆగస్ట్ 22 చిరు బర్త్ డే సందర్భంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తారని ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే మేకర్స్ సూపర్ గ్లింప్స్ తో ఆడియన్స్ లో జోష్ తెచ్చారు. విశ్వంభరపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేలా ఈ గ్లింప్స్ ఉందనడంలో సందేహం లేదు. ఒక చిన్న పిల్లాడు విశ్వంభరలో ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా మొర అని ఒక వ్యక్తిని అడగడం…అతడు ఒక సంహారం..దాని తాలూకు యుద్ధం అని అతడు చెప్పడం చూస్తే చిరు చెప్పినట్టుగా మూవీ చందమామ కథలాంటిదే అనిపించింది. గ్లింప్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆకట్టుకునేలా ఉంది. చిరు లుక్ అదిరిపోయింది.
Vishwambhara : సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్…
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ కి తగ్గట్టుగా రిచ్ గా షాట్స్ ఉన్నాయి.చోటా కె నాయుడు కెమెరా పనితనం కనిపించింది. కీరవాణి బీజీఎం తో మరోసారి సోషియో ఫాంటసీ మూవీస్ కి తనే కరెక్ట్ అనిపించుకున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి రాబోతున్న మూవీలో త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








