Sarkar Live

Meta to expand India | భార‌త్‌లో మెటా విస్తరణ.. స‌రికొత్త ప్ర‌ణాళిక

Meta to expand India : గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు భారతదేశం ఒక ప్రధాన గ‌మ్య‌స్థానంగా మారింది. ఇప్ప‌టికే అనేక కంపెనీలు ఇక్క‌డ త‌మ కార్య‌కలాపాల‌తో అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఇప్ప‌డు మేటా (Meta) కూడా అదే బాట‌లో న‌డిచేందుకు సిద్ధ‌మైంది. ఇండియాలో

Meta

Meta to expand India : గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు భారతదేశం ఒక ప్రధాన గ‌మ్య‌స్థానంగా మారింది. ఇప్ప‌టికే అనేక కంపెనీలు ఇక్క‌డ త‌మ కార్య‌కలాపాల‌తో అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఇప్ప‌డు మేటా (Meta) కూడా అదే బాట‌లో న‌డిచేందుకు సిద్ధ‌మైంది. ఇండియాలో విస్త‌రించేందుకు ఆ కంపెనీ ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నిపుణులను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

బెంగుళూరులో మెటా కొత్త కార్యాలయం

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ అయిన మెటా తాజాగా బెంగుళూరులో (Bengaluru) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించ‌నుంది. మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google), అమెజాన్ (Amazon) వంటి పెద్ద టెక్ కంపెనీల బాటలో న‌డిచేందుకు మెటా నిర్ణ‌యించింది. ఇప్పటికే ఈ సంస్థలు బెంగుళూరు సహా భార‌త్‌లోని ఇతర నగరాల్లో తమ ఇంజనీరింగ్, ప్రొడెక్ట్‌ డెవలప్‌మెంట్ టీంలను విస్తరించుకోగా మెటా కూడా అదే ప్ర‌ణాళిక‌ల‌తో ముందడగు వేస్తోంది.

Meta to expand India : టెక్నాలజీ నిపుణులకు అవకాశం

మెటా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ డైరెక్టర్ (Engineering Director) ఉద్యోగానికి జాబ్ లిస్ట్ పెట్టింది. ఈ పదవి పొందిన వ్యక్తి బెంగుళూరులో మెటా కోసం శక్తిమంతమైన టెక్నికల్ టీమ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఈ కొత్త నియామకంతో భారతదేశంలో మెటా దీర్ఘకాలికంగా ఇంజనీరింగ్ పెట్టుబడులను పెంచాలని చూస్తోంది. గతంలో భారతదేశంలో సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, పాలసీ, లీగల్, ఫైనాన్స్ వంటి విభాగాల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులను మెటా నియమించేది. ఇప్పుడు తన టెక్నికల్ టీమ్‌ను పెంచాలనే ఉద్దేశంతో నేరుగా ఇంజనీరింగ్ రోల్స్‌ను ప్రారంభిస్తోంది.

Meta కొత్త టెక్నాలజీ ప్రాజెక్టులు

లింక్డిన్‌లో పలు మెటా ఉద్యోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం బెంగుళూరు సెంటర్ మెటా (Meta) ఎంటర్‌ప్రైజ్ ఇంజనీరింగ్ టీమ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ టీమ్ కంపెనీ అంతర్గత ప్రొడక్టివిటీని పెంచేందుకు అవసరమైన టూల్స్ అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. అలాగే డేటా సెంటర్ ఆపరేషన్స్, కస్టమ్ చిప్ డెవలప్‌మెంట్ సహా AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి హార్డ్‌వేర్ ఇంజనీర్లను కూడా మెటా నియమిస్తోంది.

భారతదేశంలో ప్రస్తుతం ఉన్నమెటా కార్యాలయాలు

మెటా 2010లో భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం గురుగ్రామ్, న్యూ ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, బెంగుళూరు నగరాల్లో మెటా (Meta)కార్యాలయాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు మెటా భారతదేశంలో ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్, పాలసీ, బిజినెస్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించింది. తాజాగా బెంగుళూరులో ఇంజనీరింగ్ హబ్‌ను అభివృద్ధి చేసి ఒక కొత్త దిశలో ప్ర‌యాణించాల‌ని యోచిస్తోంది.

భారతదేశంలో మెటా మార్కెట్

మెటాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్ భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా మెటా ఉత్పత్తులను ఒక బిలియన్ మందికి పైగా భారతీయులు వాడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి మెటా యాప్‌లు భారతీయ వినియోగదారుల జీవితాల్లో ఓ భాగమయ్యాయి. టిక్‌టాక్ (TikTok) నిషేధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను భారతదేశంలో ముందుగా మెటా లాంచ్ చేసింది. భారతదేశంలో వచ్చిన విశేష ఆదరణతో ఈ ఫీచర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.

ఇతర టెక్ కంపెనీల దృష్టి

మెటాతో పాటు ఇతర టెక్ దిగ్గజాలు కూడా భారతదేశంలో తమ ఉనికిని విస్తరిస్తున్నాయి. గూగుల్ (Google) కూడా బెంగుళూరులో “అనంత” (Ananta) అనే పెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. ఇందులో గూగుల్ డీప్‌మైండ్, ఆండ్రాయిడ్, సెర్చ్, పే, క్లౌడ్, మ్యాప్స్, ప్లే స్టోర్ వంటి విభాగాల టీమ్స్ ప‌నిచేస్తున్నాయి.

భారతదేశంలో టెక్ విప్లవం

ప్రపంచంలోనే తీవ్రంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్ భారతదేశం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే AI, క్లౌడ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఇక్క‌డ‌ భారీగా పెట్టుబడులు పెట్టాయి. మెటా కూడా ఇప్పుడు అదే బాటలో అడుగేస్తూ భారతదేశాన్ని తన ప్రధాన ఇంజనీరింగ్ కేంద్రంగా మలచుకోవాలని చూస్తోంది.

ఇండియాలో మెటా AI ప్రాజెక్టులు

మెటా ప్రస్తుతం AI విభాగాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా AI ఆధారిత కొత్త ఫీచర్లు, ప్రొడక్ట్స్ అభివృద్ధి చేస్తోంది. మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్‌ను భారతదేశంలోనే మూడ్ చేసి కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. కొత్తగా AI, మెషిన్ లెర్నింగ్ నిపుణులను నియమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మెటా spokesperson ప్రకారం ఈ కంపెనీ ప్రస్తుతం బెంగుళూరులో త‌క్కువ సంఖ్యలోనే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించనుంది. అయితే, భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భాతదేశంలోని టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు మరిన్ని ఉద్యోగాలు కల్పించే అవకాశముంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?