Konda Surekha Political journey | తెలంగాణ రాజకీయ యవనికపై ఆమె ఒక సంచలనం. బెదురు లేని మాట.. వెనకడుగు వేయని నైజం.. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగే ప్రయాణం. ఆమే కొండా సురేఖ. సాధారణ గృహిణి స్థాయి నుండి రాష్ట్ర కేబినెట్ మంత్రి వరకు ఆమె ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు.
పోరాటాలే పునాదిగా.. రాజకీయ ప్రస్థానం
బీసీ బిడ్డగా సామాన్య కుటుంబంలో జన్మించిన సురేఖ, (Konda Surekha) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు (Ex MLC Konda Muralidhar Rao) వెన్నుదన్నుతో రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగారు. 1995లో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె, వరుస విజయాలతో వరంగల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా నిలిచారు.
తూర్పు కోటలో విజయభేరి
గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం ( Warangal East) నుండి భారీ మెజారిటీతో విజయం సాధించి, తూర్పు నియోజకవర్గంపై ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహిళల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషి అమోఘం.
కీలక బాధ్యతల్లో ‘మంత్రి’గా మార్క్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) నేతృత్వంలోని ప్రభుత్వంలో దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె వేగం పెంచారు.రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి, ధూపదీప నైవేద్య పథకం విస్తరణకు పెద్దపీట వేస్తున్నారు. యాదగిరిగుట్ట, భద్రాద్రి వంటి పుణ్యక్షేత్రాల వైభవాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణలో హరితహారాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తూ, అటవీ భూముల రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Konda Surekha : నిక్కచ్చిగా.. నిఖార్సుగా..
కొండా సురేఖ అంటేనే స్పష్టత. తప్పు జరిగితే ఎంతటి వారినైనా ప్రశ్నించే ధైర్యం ఆమె సొంతం. ప్రజా సమస్యల విషయంలో అసెంబ్లీ లోపల, బయట ఆమె వినిపించే గొంతుక నిరుపేదలకు కొండంత ఆశను కల్పిస్తుంది.రాష్ట్రంలో బీసీల ఆశాజ్యోతిగా, వరంగల్ తూర్పు గడ్డపై విజయకేతనం ఎగురవేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్నారామె.
”పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడటమే ఆమె సిద్ధాంతం. వరంగల్ తూర్పు అభివృద్ధి, తెలంగాణ సంక్షేమమే కొండా సురేఖ లక్ష్యం.”
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








