Minister Ponguleti తన పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన ఆర్థిక దోపిడీ వల్లే సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఆలస్యమవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతోందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఖజానాను ఖాళీ చేశారు..
ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామనే విషయం వాస్తవమేనని మంత్రి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. దీనికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ మిగల్చలేదని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను ఆ ప్రభుత్వం ఖాళీ చేసిందని, పైగా అప్పులు మిగిల్చిందని దుయ్యబట్టారు. ఆ అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టేందుకే తెలంగాణ ఆర్థిక వనరులు సరిపోవడం లేదని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు. వీటిని అధిగమించి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
ఇంకేం అన్నారంటే…
సంక్షేమ హాస్టళ్ల దుస్థితికి కేసీఆర్ కారణమని మంత్రి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆయన పాలనలోనే దుర్భర, దయనీయ పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పాడుపడ్డ ఇళ్లు, కోళ్లఫారం షెడ్లలో విద్యార్థులు బిక్కబిక్కుమంటూ కాలం వెళ్లదీశారని అన్నారు. ఇది చూసిస ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చలించిపోయారన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నారని మంత్రి తెలిపారు. సకల సౌకర్యాలతో వీటి నిర్మాణం జరుగుతోందని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] హాజరు విధానాన్ని ( Aadhaar-based Attendance System (ABAS) ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు […]