New IT parks in Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో రెండు కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైటెక్ సిటీ మాదిరిగా ఆధునిక మౌలిక సౌకర్యాలతో వీటిని స్థాపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu) వెల్లడించారు. దీనికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కుల కోసం అనుకూలమైన ప్రదేశాలను ఎంచుకొని అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్టు ఆయన చెప్పారు.
ముందుకొచ్చిన పెట్టుబడిదారులు
కొత్తగా ఏర్పడనున్న ఐటీ పార్కుల కోసం నగర పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన భూములను పరిశీలిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులకు అనువైన ప్రదేశాలనే ఎంచుకుంటామని చెప్పారు. ఈ మేరకు అమెరికాకు చెందిన డ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీ (‘Dew’ Software Company) ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు డ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా ఎదిగిందని, హైటెక్ సిటీ మాదిరిగా రెండు అదనపు ఐటీ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు.
నిర్దిష్ట విధానాలతో New IT parks
పరిశ్రమలకు భూమి కేటాయింపుపై ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్టు శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమలకు భూమి కేటాయింపు విషయంలో తెలంగాణలో ఇప్పటి వరకు నిర్దిష్ట విధానం లేదన్నారు. తమ ప్రభుత్వం దీనికి కృషి చేస్తోందన్నారు. నిర్దిష్ట కొత్త విధానాన్ని రూపొందించి పరిశ్రమలకు భూములను కేటాయిస్తామని తెలిపారు. పెట్టుబడులు, ఉద్యోగాల సంఖ్య ఆధారంగా దీనిని అమలు చేస్తామన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమణాలతో New IT parks ఏర్పాటు
ప్రతిపాదిత ఐటీ పార్కులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటవుతాయని మంత్రి అన్నారు. ప్రొఫెషనల్స్‌కు అవసరమైన సౌకర్యాలతో వీటిని నిర్మిస్తామన్నారు. మౌలిక సౌకర్యాలతోపాటు పటిష్ట రవాణా వ్యవస్థలను అందిస్తామని చెప్పారు. తద్వారా ఉద్యోగులు నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా సులభంగా చేరుకొనేలా ఈ ఐటీ పార్కుల నిర్మాణాలను చేపడతామన్నారు.
మరింత మెరుగుపడనున్న అవకాశాలు
హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది, కొత్తగా ఏర్పాటు కానున్న ఐటీ పార్కుల ద్వారా నగరం మరింత విస్తరించి, ఉద్యోగావకాశాలు మెరుగుపడనున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “New IT parks in Hyderabad | రాష్ట్రంలో మరో రెండు ఐటీ పార్కులు..”