కొన్ని రోజులు క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిరాయ్’ (Mirai) సినిమాపై వీక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. కలెక్షన్ల వర్షం సైతం కురుస్తోంది.
మొదటి రోజు ఓ మాదిరి వసూళ్లు అందుకున్న Mirai చిత్రం.. రెండు, మూడో రోజు మాత్రం భారీగానే వసూళ్లు సాధించింది. ఇక వీకెండ్ పూర్తయ్యేసరికి ఆశించినదాని కంటే ఎక్కువ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇంతకీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
హనుమాన్ ఘన విజయం తర్వాత తేజ సజ్జా చేసిన ‘మిరాయ్ కి మొదటి నుంచే ఎంతో హైప్ ఏర్పడింది. కంటెంట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా విజువల్స్ పరంగా అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. తొలిరోజు రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు రూ.55.60 కోట్లకు చేరింది. ఇక ఆదివారం ఫుల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే 3 రోజులకు కలిపి మొత్తం రూ.81.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈమేరకు అధికారికంగా వసూళ్లకు సంబంధించిన వివరాలతో ఒక పోస్టర్ ను కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరువలో వసూళ్లు ఉన్నాయి. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ విషయంలో కాస్త డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. వర్కింగ్ డేస్ నేపథ్యంలో ప్రేక్షకులు కాస్త తక్కువగానే థియేటర్లలోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పవర్ స్టార్‌పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రావడానికి మందు ‘మిరాయ్’ ఎన్ని కోట్లు రాబడుతుందో వేచి చూడాలి.
- 1వ రోజు (ఫస్ట్ డే): ₹27.20 కోట్లు గ్రాస్
- 2వ రోజు (సెకండ్ డే): ₹55.60 కోట్లు గ్రాస్ (మొత్తం)
- 3వ రోజు (సండే): ఆక్యుపెన్సీ పెరగడంతో వీకెండ్ మొత్తానికి ₹81.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    