Sarkar Live

Miryalaguda : పెళ్లి రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఆర్థిక సాయం

Miryalaguda MLA : ఎంతో ముచ్చ‌ట‌ప‌డి కొడుకు పెళ్లి చేశారాయ‌న‌. బంధుమిత్రులను ఆహ్వానించి అత్యంత వైభ‌వంగా రిసెప్ష‌న్ (marriage reception)ను అరేంజ్ చేద్దామ‌ని ఉన్నా ఆ కోరిక‌ను అంత‌టితోనే తుంచేశారు. రిసెప్ష‌న్‌కు అయ్యే ఖ‌ర్చును ఆదా చేసి రైతుల‌కు యూరియా కోసం

Miryalaguda

Miryalaguda MLA : ఎంతో ముచ్చ‌ట‌ప‌డి కొడుకు పెళ్లి చేశారాయ‌న‌. బంధుమిత్రులను ఆహ్వానించి అత్యంత వైభ‌వంగా రిసెప్ష‌న్ (marriage reception)ను అరేంజ్ చేద్దామ‌ని ఉన్నా ఆ కోరిక‌ను అంత‌టితోనే తుంచేశారు. రిసెప్ష‌న్‌కు అయ్యే ఖ‌ర్చును ఆదా చేసి రైతుల‌కు యూరియా కోసం సాయం చేశారు. మిర్యాల‌గూడ ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి (Miryalaguda MLA Battula Laxma Reddy) చాటుకున్న దాతృత్వం ఇది.

ఆర్భాటాలు వ‌ద్ద‌నుకొని అన్న‌దాత‌కు ఆస‌రా

ఎమ్మెల్యే బ‌త్తుల లక్ష్మా రెడ్డి త‌న కుమారుడు సాయి ప్రసన్న‌(Sai Prasanna) కు భవ్యమైన వివాహ విందును ఏర్పాటు చేయాలని ముందుగా ప్రణాళికలు వేసుకున్నారు. అయితే.. రైతుల దుర్భర పరిస్థితులు ఆయనను కలచివేశాయి. వర్షాభావం, పెరిగిన ఎరువుల ధరలు, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన ఆయన, విందు ఖర్చును రైతుల సంక్షేమం కోసం మళ్లించాలని నిర్ణయించుకున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు అంద‌జేత‌

విందును రద్దు చేసిన ఎమ్మెల్యే రూ.2 కోట్ల చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ .రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి అందజేశారు. ఈ డ‌బ్బుతో తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో సంచి యూరియా (free urea) చొప్పున ఉచితంగా అందించ‌నున్నారు. లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న‌తోపాటు కుటుంబ సభ్యుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిసి చెక్కును అందజేశారు.

Miryalaguda MLAపై ప్రశంస‌ల జ‌ల్లు

ఎమ్మెల్యే తీసుకున్న ఈ అరుదైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందించారు. కుటుంబ సభ్యుల సామాజిక స్పృహ, ప్రజల పట్ల చూపిన బాధ్యతను ఆయన ప్రశంసించారు. ప్రజా ప్రతినిధులు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇదేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే
లక్ష్మారెడ్డి (Battula Laxma Reddy) తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “రైతుల కోసం ఒక కుటుంబం చేసిన త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శం” అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివాహ విందు వంటి ఆర్భాటాలను పక్కనపెట్టి, సమాజ ప్రయోజనాన్ని ముందుకు తెచ్చిన ఈ నిర్ణయం రైతులకు ఊరటనిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?